Pune Porsche Crash Accident Explained | Telugu | పుణె పోర్షే కారు ప్రమాదం కేసులోని హైలైట్స్!
పుణెలో పోర్షే కార్ యాక్సిడెంట్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఓ మైనర్ ఆ కారు నడపడం వల్ల ఇద్దరు బలయ్యారు. ఇంత పెద్ద తప్పు చేసినా... ఆ మైనర్ కు బెయిల్ ఎందుకు ఇచ్చారు..? పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారి కొడుకు ఐతే మాత్రం 15 గంటల్లోనే వదిలేస్తారా..? అసలేంటీ ఈ కేసు ..? ఎందుకింత వివాదాస్పదమవుతోందో సింపుల్ గా క్లియర్ కట్ గా చెప్తాను తెలుసుకోండి..!
అది మే 19 అర్ధరాత్రి సమయం..! 12వ తరగతి పాస్ అయ్యాయనే సంతోషంలో పుణేకు చెందిన ఓ బాడా రియల్ఏస్టేట్ వ్యాపారి కొడుకు ఫ్రెండ్స్ తో కలిసి పబ్ లో పార్టీ చేసుకున్నాడు. దోస్తులంతా నిండా తాగారు. ఆ పబ్ కు సుమారు 2న్నర కోట్లు విలువ చేసే ఎలక్ట్రిక్ పోర్షె కారు వేసుకోచ్చాడు. ఇక నిండా తాగక స్టీరింగ్ ఎవరికైనా ఇస్తాడా..? తనే జోష్ జోష్ లో కారు నడిపాడు. అలా రోడ్డుపై వెళ్తున్న ఆ బైక్ ను ఢీ కొట్టాడు. దీంతో.. ఆ బైక్ పై వెళ్తున్న ఇద్దరు చనిపోయారు. ఆ మృతి చెందిన వారి స్నేహితులు పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టగా... ఆ మైనర్ కోసం పోలీసులు వెతకడం మొదలుపెట్టారు
పబ్ దగ్గర..యాక్సిడెంట్ జరిగిన దగ్గర పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించారు. ఆ కారు 160 KMPH కంటే ఎక్కువ స్పీడ్ తో వెళ్తున్నట్లు గుర్తించారు. ఆ సీసీటీవీ ని ఇంకా క్లోజ్ గా పరిశీలిస్తే డ్రైవ్ చేసింది ఓ మైనర్ అని పోలీసులు గుర్తించారు. వెంటనే ఆదివారం తెల్లవారుజామున నుంచే ఆ మైనర్ ఆచుకీ కోసం ప్రయత్నించి.. యాక్సిడెంట్ జరిగిన 15 గంటల్లోపే కోర్టు ముందు ప్రవేశపెట్టారు. నిజంగా గ్రేట్.. పోలీసులు చాలా తొందరగా రియాక్ట్ అయ్యారు. కానీ, ఇక్కడి నుంచే కథ అంతా అడ్డం తిరిగింది.
మరోవైపు.. నిందితుడి తాతయ్య సురేంద్ర కుమార్ అగర్వాల్‌కి గ్యాంగ్‌స్టర్ చోటా రాజన్‌కి లింక్స్ ఉన్నాయని తేలింది. ఇప్పటికీ ఆయన ఈ కేసు ఉంది. దీంతో.. ఓ వైపు డబ్బులు..మరోవైపు మాఫియాతో లింక్ ఉండటం వల్లే ఆ మైనర్ తప్పించుకునేందుకు అధికారులు సహకరిస్తున్నారని మృతుల కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. టీనేజర్ తెలియకుండా తప్పు చేస్తే ఒకే...కానీ, ఇలా విచ్చలవిడి తనంతో జనాల ప్రాణాలు తీసుకున్నప్పుడు కఠినంగా శిక్షించకపోతే మిగతా వాళ్లలో భయం ఎలా వస్తుందని ప్రజా సంఘాలు సైతం కోర్టు తీర్పుపై అసహనం వ్యక్తం చేస్తున్నాయి.