Priyanaka Gandhi strategy for UP | UP ఎన్నికల్లో కాంగ్రెస్ సారథిగాప్రియాంక
UP Elections ల్లో Indian National Congress ను గెలిపించేందుకు కనిపిస్తున్న ఏకైక అస్త్రం Priyanka Gandhi. UP లో CM అభ్యర్థి ఎవరూ అని కొద్దిరోజుల క్రితం అడిగితే ఎక్కడ చూసినా నేనే కనిపిస్తున్నాగా అంటూ వ్యాఖ్యలు చేసిన ప్రియాంక..ఆ తర్వాత మళ్లీ సీఎం అభ్యర్థి ప్రస్తావనను కొట్టిపారేశారు. కానీ UP లో కాంగ్రెస్ పార్టీని ఆమె నడిపిస్తున్న, నడిపించాలనుకుంటున్న తీరుకు ఈ వ్యాఖ్యలు నిదర్శనమని రాజకీయ విశ్లేషకుల అంచనా. Lakhimpur Kheri ఘటన సమయంలో బాధితుల పక్షాన పోరాడేందుకు ఒంటరిగా నిలబడినా.... యూపీలోని 403 seats లోనూ కాంగ్రెస్సే పోటీ చేస్తున్నట్లు ప్రకటించినా...యూపీలో కాంగ్రెస్ తీసుకుంటున్న ప్రతీ నిర్ణయంలోనూ Priyanka Gandhi మార్క్ స్పష్టంగా కనిపిస్తోంది.





















