Pochamma Sips Milk | పాలు పాగుతున్న పోచమ్మ తల్లి..నిజమేనా.?
పోచమ్మ తల్లి పాలు తాగుతోందా.? భక్తులు సమర్పించే పాలు లీటర్లకు లీటర్లు సేవిస్తున్నారా..అసలు ఏం జరుగుతోంది ఇక్కడ. శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని మదీనాగూడాలోని పోచమ్మ తల్లి గుడి ఇది. స్వయంభువుగా వెలసిన పోచమ్మతల్లి పాలు తాగుతోందనే వార్త ఇప్పుడు చుట్టుపక్కన ప్రాంతాల నుంచి భారీగా భక్తులను ఆకర్షిస్తోంది. గిన్నెలతో అమ్మవారికి పాలు తీసుకువచ్చి సమర్పిస్తున్నారు. మూడు రోజులుగా ఇలా జరుగుతూనే ఉంది. భక్తులకు చూపించేందుకు ఆలయ పూజారి ఓ గిన్నెలో పాలు తెచ్చి చెంచాతో అమ్మవారికి సేవిస్తుండగా పాలు మాయం అవుతుండటం తెలుస్తోంది. ఈ అద్భుత ఘట్టాన్ని వీక్షించేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నట్లు ఆలయ పూజారి తెలిపారు..Byte
అయితే ఇలా విగ్రహాలు పాలు తాగుతున్నాయనే వార్తలు ఇప్పుడు కొత్తేం కాదు. సాధారణంగా రాతితోనో, మట్టితోనో తయారయ్యే విగ్రహాలు నీటిని పీల్చుకునే గుణాన్ని కలిగి ఉంటాయని. విగ్రహాలకు ఏర్పడే పగుళ్లు సైతం ఇలాంటి వాటికి కారణమవుతాయని జనవిజ్ఞానవేదిక గతంలో అనేక సార్లు అవగాహన కల్పించింది.