MLA ROJA: చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం అభివృద్ధి పనుల్లో ఎమ్మెల్యే రోజా
చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా జేసీబీని ఆపరేట్ చేశారు. డ్రైవర్ సీట్‌లో కూర్చొని రోడ్డును తవ్వే ప్రయత్నం చేశారు. అయితే, జేసీబీ బ్లేడ్ భూమిని తాకినప్పుడు అది చిన్న జర్క్ ఇచ్చింది. దీంతో వాహనంలో ఉన్న రోజాతో పాటు.. అక్కడున్న అధికారులు, ఆమె అనుచరులు ఉలిక్కిపడ్డారు. కానీ, ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. నగరిలోని 100 పడకల ప్రభుత్వ వైద్యశాలకు తుడా నిధులు 40 లక్షల రూపాయలతో నిర్మించబోతున్న సిమెంట్ రోడ్డు నిర్మాణ పనులకు శుక్రవారం రోజా భూమిపూజ చేశారు. ఈ మొత్తంలో 27 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు, 3 లక్షల రూపాయలతో ఆర్చ్, 10 లక్షల రూపాయలతో రోడ్డుకు ఇరువైపులను లైట్లను ఏర్పాటు చేయనున్నారు. భూమి పూజ అనంతరం జేసీబీని ఆపరేట్ చేసి పనులను ప్రారంభించారు. ఆ తర్వాత హాస్పిటల్‌ను సందర్శించారు. ప్రసూతి వార్డులో బాలింతలను పరామర్శించి.. ఆసుపత్రిలో వైద్య సేవలు, సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు