Minister Vemula: బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అభివృద్ధి చూపిస్తే...రాజీనామా చేస్తా
నిజామాబాద్ జిల్లా బాల్కొండ వర్గం వేల్పూర్ లో జరిగిన రైతు సంబరం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బిజెపి , కాంగ్రెస్ పై ఫైరయ్యారు. రైతు బంధు, 24 గంటల ఉచిత కరెంట్, సాగు నీరు కోసం చెక్ డ్యాంలు, కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇలా తెలంగాణలో అమలవుతున్న పథకాలు బిజెపి, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అమలవుతున్నాయా మంత్రి పదవికి రాజీనామా చేస్తానని బిజెపి, కాంగ్రెస్ నాయకులకు సవాల్ విసిరారు మంత్రి. కేంద్రం ఇచ్చిన హామీలు, వారు చేయాల్సిన పనులు అడిగితే కేసులు పెడుతున్నారని అన్నారు. కేసీఆర్ ను టచ్ చేసి చూస్తే తెలంగాణ రక్తం ఏందో మోడీకి చూపిస్తామని అన్నారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి వస్తే ఏదో జరుగుతుoదన్నారు వారు కూడా ఓ బుడ్డర్ ఖాన్ అని తేలిపోయిందన్నారు మంత్రి వేముల




















