Krishna District: నిలువునా మునిగిన మిర్చి రైతులు
కృష్ణాజిల్లా నందిగామ మార్కెట్ యార్డ్ వద్ద మిర్చి రైతులు ధర్నాకు దిగారు. మిరప మొక్కలను రొడ్డుపై పడవేసి ఆందోళనకు దిగారు. జాతీయరహదారిపై బైఠాయించి న రైతులు నకిలీ విత్తనాలు అమ్మిన వ్యాపారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.ఈ సందర్భంగా రైతు సంఘ నాయకుడు నరసింహారావు కు పోలీసులకు మధ్యవాగ్వాదం చోటుచేసుకుంది. నకిలీ విత్తనాల కారణంగా సరిగా దిగుబడి రాకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయామని రైతులు తెలిపారు. నకిలీ విత్తనాలు అమ్మిన కంపెనీ యాజమాన్యాలను అరెస్టు చేసి నష్టపోయిన రైతులకు ఎకరానికి లక్షరూపాయల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రైతు సంఘం నాయకులు కోరారు. రైతుల ఆందోళన కారణం గా జాతీయరహదారి పై ట్రాఫిక్ స్థబించింది.





















