Indian Army Rescue Operation in Punjab | ఉత్తర భారత్ లో కొనసాగుతున్న సహాయక చర్యలు
Disc : ఉత్తర భారత్ లో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొండ చర్యలు విరిగి పడుతుండడంతో అటుగా ప్రయాణిస్తున్న వారు భయబ్రాంతులకు గురవుతున్నారు. భారీ వర్షాలతో వాగులు, చెరువులు ఉద్రిక్తంగా ప్రవహిస్తున్నాయి. ఇళ్లలోకి నీళ్లు చేరుతుండడంతో బంగ్లాలపైకి ఎక్కి సహాయం కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. పంజాబ్ లోని మాధోపూర్ హెడ్‌వర్క్స్ వద్ద వరదలో చిక్కుకు పోయిన 22 మంది CRPF సిబ్బందిని, ముగ్గురు పౌరులను ఇండియన్ ఆర్మీ ఏవియేషన్ కాపాడింది. హెలికాప్టర్ లో అక్కడకి వచ్చి ఇండియన్ ఆర్మీ ఏవియేషన్ వారిని కాపాడిన వీడియో చూసిన వారు షాక్ అవుతున్నారు. చిన్న బిల్డింగ్ పై హెలికాప్టర్ ను ల్యాండ్ చేసి... ఆ బిల్డింగ్ లో ఉన్న వారిని కాపాడారు. భారీ వర్షాల కారణంగా కొండ చర్యలు విరిగి పడుతుండడంతో వైష్ణో దేవి యాత్రను కూడా నిలిపివేశారు అధికారులు. హైదరాబాద్ సహా రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సూచించారు.





















