లత ఎందుకు పెళ్లి చేసుకోలేదు?
13 ఏళ్లకే గాయనిగా అడుగుపెట్టిన లతా మంగేష్కర్... ఇండియన్ నైటింగేల్ స్థాయికి చేరడానికి పర్సనల్ లైఫ్ లోనూ కొన్ని త్యాగాలు చేయాల్సి వచ్చింది. తన చిన్న వయసులోనే నాన్న మరణం తట్టుకోవడమే కష్టమైన విషయమంటే... అప్పటి నుంచి కుటుంబ బాధ్యతలనూ తలకెత్తుకోవడం ఎవరూ కలలోనైనా చేయలేనిది. ఆమె పెళ్లి కూడా చేసుకోకుండానే జీవితం మొత్తం గడిపారు. కొన్ని ఇంటర్వ్యూలలో కారణాన్ని అడగగా... కుటుంబ బాధ్యతల్లోనే తలమునకలుగా ఉండేదాన్ని అని, పెళ్లి ఆలోచనే తనకు రాలేదని ఆమె స్వయంగా చెప్పారు. లతా మంగేష్కర్ తండ్రి దినానాథ్ మంగేష్కర్ ఓ మరాఠీ మ్యుజీషియన్. లతకు 13 ఏళ్లు ఉన్నప్పుడు గుండెపోటుతో కన్నుమూశారు. ఆ తర్వాత కుటుంబ బాధ్యతలను లత తీసుకున్నారు. లత కెరీర్ ను.... ఆమె తండ్రి స్నేహితుడు మాస్టర్ వినాయక్ ఓ గాడిన పెట్టారు.





















