S-400 Defence System | భారత్ ఆర్మీలో సుదర్శన చక్రం S-400 | ABP Desam
భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎప్పటికప్పుడు ఉగ్రవాదుల భరతం పట్టడానికి భారత భద్రత బలగాలు రెడీగా ఉన్నాయి. నిజం చెప్పాలంటే పాకిస్తాన్ తమ ఆర్మీ కన్నా కూడా ఉగ్రవాదులనే ఎక్కువగా నమ్ముతుంది. ఏప్రిల్ 22న పహాల్గమ్ లోయలో రక్తాన్ని పారించారు. 27 మందిని చంపేశారు. 27 కుటుంబాలకు దుఖాన్ని మిగిల్చారు. అందుకే టెర్రరిస్ట్ ని టార్గెట్ చేసింది ఇండియన్ ఆర్మీ. ఆపరేషన్ సింధూర్ కూడా ఉగ్రవాద స్థావరాలను ద్వాంసం చేయడానికే చేసారు.
ప్రస్తుతం భారత్ పాకిస్తాన్ బోర్డర్ లో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. సివిలియన్స్ ని టార్గెట్ చేస్తూ అర్థరాత్రి వేళ పాకిస్తాన్ క్షిపణి, డ్రోన్ల ప్రయోగం చేసింది. కానీ పాక్ కుట్రలను ముందే తెలుసుకున్న భారత్ ఆర్మీ అన్నింటినీ సమర్థంగా తిప్పికొట్టింది. ఇందుకు సంబంధించి భారత ఆర్మీ ఒక ప్రకటన కూడా విడుదుల చేసింది. పాకిస్తాన్ చేస్తున్న దాడులను తిప్పికొట్టడానికి ఇండియన్ ఆర్మీ దెగ్గర ఉన్న వన్ అఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ వెపన్ S 400. రష్యా అభివృద్ధి చేసిన ఈ ఎస్-400 మిసైల్ సిస్టమ్ పాక్ దాడులను గుర్తించి, తిప్పి కొట్టడానికి చాలా హెల్ప్ అయింది.
రష్యాకు చెందిన అల్మాజ్ సెంట్రల్ డిజైన్ బ్యూరో తయారు చేసిన ఎస్-400 మిసైల్ సిస్టమ్ ప్రపంచంలోని అడ్వాన్స్డ్, పవర్ఫుల్ వెపన్. ఇది భూమి నుంచి ఆకాశానికి ప్రయోగించే క్షిపణి వ్యవస్థల్లో ఒకటి. ఎస్-400ను నాటో SA-21 గ్రోలర్ అని కూడా పిలుస్తుంది. 2007 నుండి ఎస్-400 ఇండియన్ ఫోర్సెస్ కి అవైలబుల్ గా ఉంది. ఎన్నో రకాల ఏరియల్ త్రెట్స్ ని ఈ మిసైల్ సిస్టం అడ్డుకుంది.
1980ల చివర్లో ఎస్-400 మిసైల్ సిస్టమ్స్‌ను అభివృద్ధి చేయడం మొదలు పెడితే 1999లో టెస్ట్ చేసారు. అది సక్సెస్ అయింది. అన్ని లోపాలను కరెక్ట్ చేసుకుంటూ ఎస్ 400 .. 2007 నుండి అవైలబుల్ లోకి వచ్చింది. అప్పటి నుండి రష్యా, భారత్ మాత్రమే కాకుండా అనేక ఇతర దేశాలు దీని ఉపయోగిస్తున్నాయి. ఎస్-400 మిసైల్ సిస్టమ్ లో ఒక కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ఎప్పటికప్పుడు కోఆర్డినేట్ చేస్తూనే ఉంటుంది.





















