Ratan Tata: జీవితాంతం మూగజీవాలకు సేవ చేసిన రతన్ టాటా
జంతు ప్రేమికులు చాలా మందే ఉంటారు. కానీ రతన్ టాటా వేరు. ఆయన ప్రేమకు అవధులు లేవు. రోడ్డు మీద వెళ్లే వీధి కుక్కల్ని చూస్తే ఆయన ప్రాణం అల్లాడిపోతుంది. కన్నీళ్లు పెట్టేసుకుంటారు. వాటి సంరక్షణ కోసం తన జీవితాంతం కృషి చేశారు రతన్ టాటా. ప్రమాదాల బారిన పడో లేదా మరేదైనా ఘటనతో అవయవాలు సరిగ్గా లేకుండా ఇబ్బంది కుక్కులను తిరిగి నడిచేలా చేయటం వాటి సంరక్షణ, పెంపకాన్ని బాధ్యతగా తీసుకోవటం రతన్ టాటాకు చాలా ఇష్టమైన వ్యాపకం. వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యాలున్న రతన్ టాటా సోషల్ మీడియా చూస్తే ఈ విషయం ఇట్లే అర్థమైపోతుంది. ఈ రోజు కుక్కపిల్ల దొరికింది.
ఎవరైనా దీన్ని పెంచుకోవాలనుకుంటే నాకు మెసేజ్ చేయండి అని పెడతారు. ఎవరైనా ఆ కుక్కను అడాప్ట్ చేసుకుంటే ధన్యవాదాలు పెడతారు. తన కంపెనీలో పనిచేసే వారెంత చిన్న ఉద్యోగి పర్లేదు ఏదైనా కుక్కల సంరక్షణ కోసం చిన్న కృషి చేసినా పోస్ట్ పెట్టేస్తారు రతన్ టాటా. అంతే కాదు ముంబైలో ఇలా అనాధలుగా మిగిలిపోయిన జంతువులకు వైద్యం అందించేలా స్మాల్ యానిమల్ హాస్పిటల్ ను ఏర్పాటు చేశారు రతన్ టాటా. టాటా ట్రస్టులకు ఈ జంతువుల వైద్యశాల బాధ్యతలను అప్పగించారు.