(Source: Poll of Polls)
Ratan Tata Last Post: సోషల్ మీడియాలో రతన్ టాటా లాస్ట్ పోస్ట్ ఇదే
రతన్ టాటాలో ఉన్న గొప్ప క్వాలిటీ ఏంటంటే మారుతున్న కాలానికి అనుగుణంగా తనను తాను మార్చుకోవడం. టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవడం. ఈ తరం కుర్రాళ్లతో పోటీ పడి మరి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్నారు రతన్ టాటా. తరచూ స్ఫూర్తిమంతమైన ఫొటోలు పెట్టే వారు. టాటా ట్రస్ట్‌లు చేపట్టిన సేవా కార్యక్రమాల అప్‌డేట్స్ పోస్ట్ చేసే వారు టాటా. ముఖ్యంగా వీధి కుక్కల అడాప్షన్‌కి సంబంధించిన పోస్ట్‌లు చేసే వారు. అప్పుడప్పుడూ తన అభిప్రాయాలను కోట్స్ రూపంలో పంచుకునే వాళ్లు. ఇంత యాక్టివ్‌గా ఉండే రతన్ టాటా సోషల్ మీడియాలో పెట్టిన లాస్ట్ పోస్ట్ ఏంటో తెలుసా..? తన హెల్త్ అప్‌డేట్ గురించి. రెండు రోజుల క్రితమే రతన్ టాటా పరిస్థితి విషమంగా ఉందని, ఐసీయూలో చికిత్సలో పొందుతున్నారని వార్తలు వచ్చాయి. సోషల్ మీడియా అంతా ఇదే ప్రచారం జరిగింది. దీనిపై వెంటనే స్పందించారు రతన్ టాటా. స్వయంగా ఆయనే సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. తన ఆరోగ్యం గురించి వస్తున్న వార్తలను నమ్మొద్దని, జస్ట్ రెగ్యులర్ మెడికల్ చెకప్ కోసమే వెళ్లానని చెప్పారు. తన గురించి ఇంతగా ఆలోచించడం ఆనందంగా ఉందని అన్నారు. మీడియా ఇలాంటి వదంతులకు దూరంగా ఉండాలని సూచించారు. అక్టోబర్ 7వ తేదీన ఈ పోస్ట్ పెట్టారు. సరిగ్గా రెండు రోజుల తరవాత ఆయన తుది శ్వాస విడిచారు. ప్రస్తుతం సోషల్ మీడియా అంతా రతన్ టాటాకి సంబంధించి పోస్ట్‌లతో నిండిపోతోంది. అంతగా ఇంపాక్ట్ చూపించారు ఆయన.