అన్వేషించండి
Ratan Tata: రతన్ టాటా మృతిపై స్పందించిన మాజీ గర్ల్ ఫ్రెండ్
రతన్ టాటా మృతి దేశమంతటినీ కలిచి వేసింది. ఇండస్ట్రియలిస్ట్‌గా, అంతకి మించి గొప్ప మానవతా వాదిగా పేరు తెచ్చుకున్నారు టాటా. విజనరీ ఉన్న గొప్ప వ్యక్తిని కోల్పోయామంటూ సోషల్ మీడియాలో పలువురు ప్రముఖులు పోస్ట్‌లు పెడుతున్నారు. అయితే...ఓ పోస్ట్ మాత్రం చాలా స్పెషల్. ఎందుకంటే...ఆ పోస్ట్ చేసిన వ్యక్తి రతన్ టాటాకి చాలా స్పెషల్ కాబట్టి. ఆ వ్యక్తి ఎవరో కాదు. టాటాకి మాజీ గర్ల్‌ఫ్రెండ్‌గా అంతా చెప్పుకునే సిమి గరేవల్. పంజాబ్‌కి చెందిన సిమ్రిత పలు బాలీవుడ్ చిత్రాల్లో నటించారు. కొన్ని సినిమాలను ప్రొడ్యూస్ చేశారు. టీవీ షోల్లోనూ కనిపించారు. రతన్ టాటా మృతి పట్ల స్పందించిన ఆమె ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. "మీరు లేరని ఈ ప్రపంచమంతా చెబుతోంది. కానీ ఈ నిజాన్ని తట్టుకోవడం నా వల్ల కావడం లేదు. ఫేర్‌వెల్ మై ఫ్రెండ్" అని పోస్ట్ చేశారు సిమి గరేవల్. ఒకప్పుడు రతన్ టాటాని సిమి ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూ ఇమేజ్‌లను షేర్ చేస్తూ ఈ పోస్ట్ పెట్టారు. సిమితో రతన్ టాటా ప్రేమలో పడ్డారని, పెళ్లి కూడా చేసుకోవాలను కున్నారని..కాకపోతే రకరకాల కారణాల వల్ల అది కుదరలేదన్న ప్రచారం ఉంది. ఇందులో ఎంత నిజముందన్నది పక్కన పెడితే ఆమె పెట్టిన పోస్ట్ మాత్రం వైరల్ అవుతోంది. సిమి కూడా చాలా సందర్భాల్లో రతన్ టాటాని పొగిడారు. ఆయన సెన్సాఫ్ హ్యూమర్ ఎంతో ఇష్టమని, ఆయనో పర్‌ఫెక్ట్ జెంటిల్‌మెన్ అని అన్నారు.
పైగా ఇదే ఇంటర్వ్యూలో సిమి రతన్ టాటాని ఓ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడిగారు. పెళ్లెందుకు చేసుకోలేదని ప్రశ్నించారు. అందుకు రతన్ టాటా ఆసక్తికర సమాధానమిచ్చారు. "ఎందుకిలా ఉండిపోయాడన్నది సరిగ్గా నాకే తెలియదు. చాలా సార్లు ఒంటరిగా ఫీల్ అయ్యాను. భార్య, కుటుంబం లేదే అని బాధ పడ్డాను. కానీ..అంతలోనే ఈ ఒంటరితనాన్ని స్వేచ్ఛగా భావించాను. ఇంకెవరి కోసమో నేను ఆలోచించడం, వాళ్ల ఫీలింగ్స్ గురించి కూడా నేనే పట్టించుకోవడం..ఇలాంటివేమీ లేకుండా హాయిగా ఉన్నాననిపిస్తోంది. చాలా సార్లు పెళ్లి వరకూ వెళ్లాను. కానీ...ఎందుకో వర్కౌట్ కాలేదు" అని వివరించారు రతన్ టాటా.
ఇండియా
INSV Kaundinya Explained | INSV కౌండిన్య స్పెషాలిటి తెలుసా ?
Delhi Bangladesh High Commissionerate | బంగ్లాదేశ్ హైకమిషనరేట్‌ను ముట్టడించిన హిందూ సంఘాలు | ABP
G RAM G Bill | లోక్‌సభలో ఆమోదం పొందిన జీరామ్‌జీ బిల్లుని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? | ABP Desam
భారతదేశంలోనే అత్యంత విచిత్రమైన ఆచారాలు పాటించే ఉడిపి శ్రీకృష్ణ మందిరం
Leonel Messi Kolkata Tour Hightension | కోల్ కతా సాల్ట్ లేక్ స్టేడియంలో తీవ్ర ఉద్రిక్తత | ABP Desam
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
తెలంగాణ
తెలంగాణ
ఓటీటీ-వెబ్‌సిరీస్





















