Case Filed on RCB Management | RCB యాజమాన్యం పై కేసు నమోదు | ABP Desam
చిన్నస్వామి స్టేడియం వెలుపల జరిగిన తొక్కిసలాట ఘటనలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై FIR నమోదు చేశారు. RCBతోపాటు DNA ఈవెంట్ మేనేజర్, కర్ణాటక క్రికెట్ అసోసియేషన్లపై కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్‌లో FIR నమోదు చేశారు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం సమీపంలో జరిగిన తొక్కిసలాటలో 11 మంది మరణించగా, 50 మందికిపైగా గాయపడ్డారు. ఈ తొక్కిసలాటపై జాతీయ మానవ హక్కుల సంఘం NHRC స్పందించింది. జిల్లా యంత్రాంగం, పోలీసులకు నోటీసులు పంపి, ఒక వారంలో నివేదిక సమర్పించాలని కోరింది. NHRC ప్రకారం, అధికారుల ద్వారా జనాలను నియంత్రించడంలో సరైన ప్రణాళికలు లేవనే ఆరోపణలు వచ్చాయి. విషాదం జరిగిన తర్వాత, స్టేడియం వెలుపల మృతదేహాలు పడి ఉన్నప్పటికీ, స్టేడియం లోపల వేడుకలు కొనసాగాయి. ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని, బాధ్యులైన అధికారులను గుర్తించాలని, బాధితులకు నష్టపరిహారం అందించాలని, న్యాయం చేయాలని కోరారని NHRC తెలిపింది.విజయోత్సవ పరేడ్ సమయంలో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వెలుపల జరిగిన తొక్కిసలాట ఘటనపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సంచలన చర్యలు తీసుకున్నారు. పలువురు పోలీసు అధికారులతో పాటు క్రికెట్ స్టేడియం ఇన్‌ఛార్జ్‌పై కూడా వేటు వేశారు.





















