![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
మరో వివాదంలో చిక్కుకున్న కేంద్రమంత్రి అజయ్ మిశ్రా
కేంద్రమంత్రి అజయ్ మిశ్రాను బర్తరఫ్ చేయాలనే డిమాండ్ ఊపందుకుంది. ఇప్పటికే విపక్ష సభ్యులు పార్లమెంటులో ఈ మేరకు డిమాండ్ చేస్తున్నారు. అయితే తాజాగా కేంద్రమంత్రి అజయ్ మిశ్రా మరో వివాదంలో చిక్కుకున్నారు.లఖింపుర్ ఖేరీ ఘటనలో ప్రధాన నిందితుడైన తన కుమారుడు ఆశిష్ మిశ్రా గురించి ABP రిపోర్టర్ ప్రశ్నించగా అజయ్ మిశ్రా ఫైర్ అయ్యారు. అసభ్య పదజాలంతో దూషించారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.అంతటితో ఆగని మంత్రి.. సదరు జర్నలిస్ట్ చేతి నుంచి మైక్ లాక్కొనే ప్రయత్నం చేశారు. రిపోర్టర్లను దొంగలుగా అభివర్ణించారు. ఉత్తర్‌ప్రదేశ్ లఖింపుర్ ఖేరీలో ఆక్సిజన్ ప్లాంట్ ప్రారంభోత్సవానికి వచ్చారు అజయ్ మిశ్రా. ఆ సమయంలోనే రిపోర్టర్లు అడిగిన ప్రశ్నలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.లఖింపుర్ ఖేరీ ఘటనపై పార్లమెంటులో విపక్షాలు ఆందోళన చేశాయి. లోక్ సభలో ఘటనపై చర్చించాలని కాంగ్రెస్‌తో పాటు విపక్షాలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వాయిదా తీర్మానం నోటీసులు ఇచ్చారు. విపక్ష సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లారు. దీంతో సభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడింది. మళ్లీ 2 గంటలకు సభ ప్రారంభం కాగా.. విపక్షాలు మాత్రం లఖింపుర్ ఘటనపై చర్చకు పట్టుబట్టాయి. దీంతో లోక్‌సభకు గురువారానికి వాయిదా వేశారు స్పీకర్.
![Ambani School Annual Day Celebrations | ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవానికి క్యూకట్టిన సెలబ్రెటీలు | ABP Desam](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/12/20/96372469c163e6327443db0296e64a521734710742648310_original.jpeg?impolicy=abp_cdn&imwidth=470)
![అంబేడ్కర్ వివాదంపై పార్లమెంట్లో బీజేపీ, కాంగ్రెస్ ఆందోళనలు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/12/19/0f545f42bbe261f7bf3e7de3ed93bac91734598615015517_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
![నా కామెంట్స్‌ని ట్విస్ట్ చేశారు, అంబేడ్కర్ వివాదంపై అమిత్ షా](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/12/19/d43e4b29cd890241159106bc397e584f1734598098569517_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
![Mumbai Ferry Capsized 13 Died | నేవీ బోట్...టూరిస్ట్ బోట్ ఢీ కొట్టడంతోనే ప్రమాదం | ABP Desam](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/12/18/6756320227a3ceb768def199b25b4d011734538586794310_original.jpeg?impolicy=abp_cdn&imwidth=100)
![Amitshah vs Rahul Gandhi Ambedkar Controversy | పార్లమెంటును కుదిపేసిన 'అంబేడ్కర్ కు అవమానం' | ABP](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/12/18/8fa97c1b301cf7fe28f172efae834a681734538418838310_original.jpeg?impolicy=abp_cdn&imwidth=100)
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Sadhguru is a Yogi, mystic, visionary and author](https://cdn.abplive.com/imagebank/editor.png)