Hero Team PressMeet: తిరుపతిలో సందడి చేసిన ASHOK Galla- హీరో సినిమా యూనిట్
తిరుపతిలో హీరో సినిమా యూనిట్ సందడి చేసింది. ఈ నెల 15వ తేదీ సంక్రాంతి రోజు సినిమా విడుదల కానున్న నేపథ్యంలో మీడియా సమావేశాన్ని యూనిట్ సభ్యులు ఏర్పాటు చేశారు. మీడియా సమావేశంలో హీరో అశోక్ గల్లా, హీరోయిన్ నిధి అగర్వాల్, దర్సకుడు శ్రీరాం ఆదిత్యతో పాటు గల్లా కుటుంబం పాల్గొన్నారు.. హీరోగా తెలుగు ప్రేక్షకులు తనను ఆశీర్వదించాలని హీరో అశోక్ గల్లా కోరారు. ఎంతో కష్టపడి హీరో సినిమాలో నటించానని, హీరో సినిమాలోని ప్రతి క్యారెక్టర్ ఆకట్టుకుంటుందన్నారు. సంక్రాంతి రోజు సినిమా విడులవుతుండడం సంతోషంగా భావిస్తున్నట్లు చెప్పారు. ఇప్పట్లో రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదన్నారు అశోక్ గల్లా. "హీరో" చిత్రం హీరోయిన్ నిధి అగర్వాల్ మాట్లాడుతూ.. హీరో సినిమాను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారన్న నమ్మకం ఉందని,తాను నటించిన సినిమాల్లోనే హీరో సినిమా ప్రత్యేకమన్నారు."హీరో" చిత్రం దర్శకుడు శ్రీరాం ఆదిత్య మాట్లాడుతూ.. మాస్ ప్రేక్షకులను హీరో సినిమా అలరిస్తుందని, సీనియర్ నటులందరూ హీరో సినిమాలో నటించారన్నారు. అమరరాజా గ్రూప్స్ చైర్ పర్సన్ గల్లా అరుణ కుమారి మాట్లాడుతూ.. మనవడు అశోక్ గల్లా హీరో కావడం మాకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. తమ బావ రమేష్ బాబును కోల్పోయినా సినిమాపై ఆధారపడిన వారి శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని