Hanuman Junction Police : అసలు పేకాటే ఆడలేదంటున్న బాధితులు, అక్రమ కేసు పెట్టారంటూ నిరసన
కృష్ణాజిల్లా హనుమాన్ జంక్షన్ వద్ద విచిత్ర పరిస్దితి వెలుగు చూసింది.పేకాట శిబిరం పై పోలీసులు దాడి చేసి నగదును, స్వాధీనం చేసుకోవటంతో పాటుగా పేకాట రాయుళ్ళను అరెస్ట్ చేసినట్లుగా కేసు నమోదు చేశారు..అయితే ఇక్కడే అసలు మెలిక ఉంది..తామంతా పేకాట ఆడకుండానే పోలీసులు కేసు నమోదు చేశారంటూ బాధితులు ఎదురు తిరిగారు.అక్రమ కేసు పెట్టిందే కాక,పేకాట శిబిరం పేరుతో తమ వద్ద 50వేలకు పైగా నగదును స్వాధీనం చేసుకొని కేవలం 1300 రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లుగా పోలీసులు లెక్కల్లో చూపించారని బాధితులు ఆరోపిస్తున్నారు.పోలీసులు చర్యలకు నిరసనగా హనుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్ వద్ద ధర్నా నిర్వహించారు.





















