Gali Janardhan Reddy|Bellary: పదేళ్ల తర్వాత బళ్లారిలో గాలి జనార్థన్ రెడ్డి
బళ్ళారిలో సుదీర్ఘ కాలం తరువాత అడుగుపెట్టిన గాలి జనార్దన్ రెడ్డికి ఆయన అభిమానులు బ్రహ్మరథం పట్టారు.బళ్లారిలో కనకదుర్గమ్మ గుడిలో తులాభారం సమర్పించి అమ్మవారికి మొక్కులు సమర్పించుకొన్నారు గాలి జనార్దన్ రెడ్డి.ఈ సందర్బంగా ఉద్వేగానిక గురయ్యారు గాలి జనార్దన్ రెడ్డి.దాదాపు పదేళ్ల పాటు బళ్ళారికి దూరంగా వుండాల్సి రావడం దురదృష్టకరం అని అన్నారు.కష్టసమయాల్లో తమ కుటుంభానికి అండగా బళ్ళారి ప్రజలు ఎల్లప్పుడూ అండగా వున్నారని,వారికి దన్యవాదాలు తెలియచేశారు.సిబిఐ కోర్టు బళ్ళారికి వెల్లేందుకు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఆయన బళ్ళారికి చేరుకొన్నారు.తన జన్మదినాన్ని అభిమానుల మద్య జరుపుకొన్నారు.ఇక నుంచి బళ్ళారిలోనే వుండి ఈ ప్రాంతానికి సేవ చేసుకొంటానని అన్నారు.





















