Anganawadi Sarees: అరవైఏడు వేల మంది అంగన్వాడీలకు ప్రభుత్వం సంక్రాంతి కానుక
తెలంగాణలో అంగన్వాడి టీచర్లు, ఆయాలను సముచితంగా గౌరవించేందుకు ఇప్పటికే మూడు సార్లు వేతనం పెంచి, 30 శాతం పీఆర్సీ ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు నేతన్నలను ప్రోత్సహించడంలో భాగంగా అంగన్వాడీలకు చేనేత వస్త్రాలు అందించిందని మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. హైదరాబాద్ లోని కేటీఆర్ క్యాంప్ కార్యాలయంలో మంత్రులు కేటిఆర్, సత్యవతి రాథోడ్ కలిసి ఈ చేనేత చీరలను అంగన్వాడీలకు అందించారు. అనంతరం ట్రాన్స్ జెండర్లు తయారు చేసిన చేనేత - జ్యూట్ బ్యాగులను విడుదల చేశారు. రాష్ట్రంలోని 31,711మెయిన్ అంగన్వాడి కేంద్రాలు, 3989 మినీ అంగన్వాడి కేంద్రాలలోని 67,411 మంది అంగన్వాడి టీచర్లు, ఆయాలు, మినీ అంగన్వాడీ టీచర్లకు ఈ చేనేత చీరలు అందనున్నాయని మంత్రి సత్యవతి తెలిపారు.





















