Andhra Pradesh | కొత్త జిల్లాల పై ఆందోళనలు ఎక్కడ వరకు వెళతాయి.
ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాల ఏర్పాటు పై రాష్ట్రవ్యాప్తంగా కొన్ని చోట్ల ఆందోళనలు, నిరసనలు వ్యక్తమవుతున్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటు జరిగినప్పుడు ఈ రకమైనటువంటి కొత్త డిమాండ్లు రావడం సహజమే అయినప్పటికీ స్థానికంగా ఉండే ప్రజల అభిప్రాయాలు కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలి. ఇన్నాళ్లు తమకు జిల్లా వస్తుందని ఆశించిన కొన్ని ప్రాంతాల వాసులు కొంత నిరాశకు గురవుతున్నారు. కొన్నిచోట్ల తమ కు జిల్లా కేంద్రం దూర భారం అవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఈ కొత్త డిమాండ్లను ఏ మేరకు పరిగణలోకి తీసుకుంటుంది చూడాలి. అలాగే కొత్త జిల్లాల ఏర్పాటు తో కొత్త సమస్య కూడా రానుంది. రెవెన్యూ భారం రాష్ట్రంపై పడనుంది. ఇప్పటికే అప్పుల్లో ఉన్న ఆంధ్ర ప్రదేశ్ ని ఎలా ఎదుర్కొంటుందో కూడా చూడాలి.





















