Actor Nani: ఫ్యాన్స్ అన్నమాటలకు నా భార్య పది సూట్లు కొనిపెట్టింది
రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో నాని హీరోగా రూపొందిన చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’. ఇందులో సాయి పల్లవి, కృతీ శెట్టి, మడోనా సెబాస్టియన్ హీరోయిన్స్‌గా నటించారు. ఈ సినిమా ప్రీరిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్ లో జరిగింది. ఈ సందర్భంగా హీరో నాని మాట్లాడుతూ..‘సినిమా ఫంక్షన్స్‌లో ఎప్పుడూ వైట్ డ్రెసెస్‌లోనే కనిపిస్తుంటానని నా అభిమానులు కొందరు సోషల్ మీడియా ద్వారా చెప్పారు. దీంతో నా భార్య నా కోసం పది సూట్స్ కొనిపెట్టింది. వాటిని ఎప్పుడు వేసుకోవాలనుకున్నా ‘నేను ఏం చేశానని వేసుకోవాలి?’ అనుకునేవాణ్ణి. ఇప్పుడు ‘శ్యామ్ సింగరాయ్’ సినిమా చేసి, చూసుకుని సూట్ వేసుకుని ఇక్కడికి ధైర్యంగా వచ్చాను. ఈ సినిమాతో సూట్ వేసుకునే అర్హత వచ్చిందనుకున్నాను’’ అని నాని అన్నారు.



















