Madhya Pradesh Elections 2023 ABP C Voter Exit Polls: కమల్ నాథ్ నేతృత్వంలోని కాంగ్రెస్ దే అధికారమా?
ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియ ఇవాళ తెలంగాణ ఎన్నికలతో ముగిసింది. డిసెంబర్ 3వ తేదీన రిలీజ్ అవబోయే ఈ ఎన్నికల ఫలితాల గురించి దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ నేపథ్యంలో ప్రతి రాష్ట్రంలోనూ ఎగ్జిట్ పోల్స్ ను ఏబీపీ సీ ఓటర్ సర్వే అంచనా వేసింది. మధ్యప్రదేశ్ లో పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. 230 స్థానాల పెద్ద రాష్ట్రం మధ్యప్రదేశ్ లో ఓటర్లు అధికార మార్పిడి కోరుకుంటున్నారు. 230 అసెంబ్లీ స్థానాల్లో ఏబీపీ సీ ఓటర్ ఎగ్జిట్ పోల్స్ ను నిర్వహించగా.... 125స్థానాల్లో కాంగ్రెస్ గెలిచి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలుస్తుందని తెలుస్తోంది. కాంగ్రెస్ కు 125 స్థానాలు వస్తే..ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ కి 100 స్థానాలు మాత్రమే వచ్చేలా కనిపిస్తున్నాయి.





















