![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Vijay Sethupathi at Maharaja Success Meet |స్క్రిప్టుల విషయంలో విజయ్ సేతుపతి సెలక్షన్ ఇలా| ABP Desam
హైదరాబాద్ లో జరిగిన 'మహారాజ' సక్సెస్ మీట్ లో విజయ్ సేతుపతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన సేతుపతి..సినిమా స్క్రిప్టుల విషయంలో తను ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయ్యేప్పుడు ఏయే పాయింట్స్ ఆలోచిస్తారు అనే విషయాలపై మాట్లాడారు.
ఇక, 'మహారాజ' థాంక్ యూ మీట్‌లో ఆ సినిమా విజయం గురించి విజయ్ సేతుపతి మాట్లాడుతూ... ''తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ నాపై ఎంతో ప్రేమ, అభిమానం చూపిస్తున్నారు. ఆ ప్రేమ చూసి కొంచెం భయం వచ్చింది. 'మహారాజ' తప్పకుండా విజయం సాధించాలని కోరుకున్నా. ఇప్పుడు ఈ సినిమాకు వస్తున్న అద్భుతమైన స్పందన నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. తెలుగు ప్రేక్షకులు నన్ను ఎప్పుడు ఎక్కడ కలిసినా '96', 'మాస్టర్', 'విక్రమ్', 'ఉప్పెన' సినిమాలు ఎంతో ఇష్టమని చెబుతూ ఉంటారు. మీరు నాపై చూపిస్తున్న ప్రేమాభిమానాలకు థాంక్స్. ఇక్కడకు విచ్చేసిన దర్శకులు సినిమా గురించి గొప్పగా చెబుతుంటే ఆనందంగా వుంది. బుచ్చి (బుచ్చిబాబు సానా) నాకు తమ్ముడు లాంటి వాడు. 'ఉప్పెన' లాంటి మంచి సినిమా తీశాడు. ఇప్పుడు రామ్ చరణ్ గారితో పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. ఈ థాంక్ యూ మీట్‌కి అతను రావడం నాకు సర్ ప్రైజింగ్'' అని చెప్పారు.
![Keerthy Suresh With Mangalasutra | బాలీవుడ్ ప్రమోషన్స్ లో తాళితో కనిపిస్తున్న కీర్తి సురేశ్ | ABP](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/12/19/6733311fd25846c232b605ae5968e3891734624485808310_original.jpeg?impolicy=abp_cdn&imwidth=470)
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Sadhguru is a Yogi, mystic, visionary and author](https://cdn.abplive.com/imagebank/editor.png)