Ram Charan Game Changer Mumbai | బాలీవుడ్ ప్రమోషన్స్ మొదలుపెట్టిన రామ్ చరణ్ | ABP Desam
బాలీవుడ్ ను పుష్ప 2 రప్పా రప్పా వణికించిన చోట...ఇప్పుడు బావ రామ్ చరణ్ వేట మొదలుపెట్టాడు. గేమ్ ఛేంజర్ ప్రమోషన్స్ కోసం బాలీవుడ్ లో అడుగుపెట్టాడు రామ్ చరణ్. సరిగ్గా బాలీవుడ్ లో పుష్ప 2 కలెక్షన్లు 800 కోట్లు సాధించిన రోజున రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ప్రమోషన్స్ కోసం ముంబైలో అడుగుపెట్టడం కాకతాళీయం. హీరోయిన్ కియారా అడ్వానీలో హిందీ బిగ్ బాస్ లో పార్టిసిపేట్ చేసేందుకు సెట్ వెళ్లారు రామ్ చరణ్. వరుసగా నాలుగోవారం కూడా
50కోట్ల పైన కలెక్షన్లు సాధించిన అల్లు అర్జున్ పుష్ప 2 ఏకంగా 800 కోట్ల క్లబ్ ను క్రియేట్ చేసింది. 100ఏళ్ల హిందీ సినీ చిత్రపరిశ్రమలో 800కోట్ల రూపాయలు కేవలం హిందీ బెల్ట్ నుంచే సాధించిన తొలి సినిమాగా అల్లు అర్జున్ ఎవరికీ అందనంత ఎత్తులో నిల్చున్నాడు. ఇప్పుడు బన్నీ పెట్టిన రికార్డులను చరణ్ గేమ్ ఛేంజర్ తో బ్రేక్ చేస్తాడా..శంకర్ సినిమా ప్యాన్ ఇండియా లెవల్లో మ్యేజిక్ చేసి బన్నీ వణికించిన చోట గ్లోబల్ స్టార్ రేంజ్ ఏంటో చూపిస్తుందా..10వ తారీఖు వరకూ వెయిట్ చేయాల్సిందే.