Nani HIT 3 Movie Review | నాని HIT 3 తో ఓ క్లారిటీ అయితే ఇచ్చేశాడు | ABP Desam
నాని HIT 3 సినిమా చేసింది... తనను తను మాస్ హీరోగా ప్రూవ్ చేసుకోవటానికి...ఇండస్ట్రీలో సర్వైవ్ కాలేవని కెరీర్ బిగినింగ్ నుంచి వినిపించిన మాటలను ఒక్క బ్యాంగ్ తో చెల్లా చెదురు చేయటానికి నాని బీభత్సంగా ట్రై చేస్తున్నాడు. మాములు బీభత్సంగా కాదు. ఒక దసరా...ఒక సరిపోదా శనివారం...ఇవాళ HIT 3...రేపొచ్చే ప్యారడైజ్ ఈ లైనప్ చూసి అర్థం చేసుకోవచ్చు నాని ప్లానింగ్ ఏంటో అని. క్యారెక్టర్ చేయగలను దమ్ముంది అని నిరూపించుకునే ఎవ్వరైనా కూడా మాస్ రోల్స్ చేయొచ్చు. మాస్ అంటే అదేదో బ్రహ్మ పదార్థం కాదు మనలో నుంచి జనాల్లో నుంచి వచ్చేదే అది. HIT 3 నాని ఓన్ ప్రొడక్షన్ సినిమా. తనే డబ్బులు పెట్టుకుని మరీ హిట్ 3 లో అర్జున్ సర్కార్ గా తన మాస్ అవతారం చూపించాడు. మరి కష్టం ఫలించిందా..సినిమా వర్క్ వుట్ అయ్యిందా...HIT 3 నాని కెరీర్ కు ఆయనకున్న లార్జర్ దేన్ ది లైఫ్ గోల్ కి పుష్ ఇస్తుందా అట్లీస్ట్ హెల్ప్ అవుతుందా HIT3 రివ్యూలో చూద్దాం.
బేసిక్ గా ఇది HIT 3 సినిమా కథ దాని రివ్యూ అని మాట్లాడుకునే కంటే..నాని పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి...డైరెక్టర్ శైలేష్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి సినిమాను వీళ్లు డీల్ చేసిన విధానం గురించి మాట్లాడుకుందాం. HIT వర్స్ గురించి మనకందరికీ ఓ ఐడియా వన్ టూ పార్ట్స్ చూశాం కాబట్టి. అసలు కనిపెట్టకుండా వీలు లేకుండా అత్యంత క్రూరంగా మనుషులను చంపేసి...నరహంతకులను చాకచక్యంగా పట్టుకునే పోలీసుల కథలు. హిట్ 1,2 ల్లో ఎవరు చంపారో తెలుసుకోవటమే సినిమా. అయితే హిట్ 3 ఆ పై రెండింటీకి డిఫరెంట్. ఎవరు చంపుతున్నారో తెలుస్తుంది. వాళ్లు ఎందుకు చంపుతున్నారు..వాళ్లను వీళ్లు ఎలా చంపుతారు అన్న స్టైల్ లో సాగింది సినిమా అంతా.
ఇటీవలి కాలంలో తెలుగు సినిమా చూడనంత వయొలెన్స్ ఉంది సినిమాలో. పూర్తిగా బ్లడ్ బాత్. రక్తంతో నాని తడిసి ముద్దయ్యాడు. చిన్న పిల్లలు, ఫ్యామిలీస్ తో చూడటం భరించటం కష్టం. సినిమాలో చాలా బూతులు కూడా ఉన్నాయి. A సర్టిఫికెట్ సినిమా. నాని కూడా వాళ్లబ్బాయికి సినిమా చూపించనని చెప్పేశాడు. సరే ఇప్పుడు ఇది A సర్టిఫికేట్ సినిమా అనో హింస ఎక్కువ ఉందనో వర్కువుట్ అయ్యిందా అవ్వలేదా అని చెప్పటం లేదు. హింసను ఎంతైనా చూడొచ్చు. కానీ దానికి బలమైన పర్పస్ కావాలి. అన్ ఫార్చునేట్లీ ఈ సినమా లో ఆ పర్పస్ ఏంటనేది చివరి వరకూ తెలియదు. అలా కంప్లీట్ గా దాచి పెడుతున్నట్లు కూడా కాదు. మధ్యలో మధ్యలో రివీల్ చేస్తుంటాడు కానీ పూర్తిగా చెప్పడు. ఫలితంగా సినిమా సాగుతుంది కానీ తెర మీద జరుగుతున్న ఊచకోత చూసేవాడు కనెక్ట్ కాలేడు. కొద్ది సేపటి తర్వాత జుగుప్స మొదలవుతుంది. అసలు వాళ్లు నరుకుతున్నారు సరే హీరో ఎందుకు అంత కంటే దారుణంగా వాళ్లను చంపుతున్నాడు..అదే డైరెక్టర్ కథకు ఇవ్వాలనుకున్న జస్టిఫికేషనా అర్థం కాదు.
హాలీవుడ్ సినిమాలు చూసేవాళ్లకు డైరెక్టర్ క్వింటన్ టరంటినో ఐడియా ఉండే ఉంటాడు. స్టైల్జెడ్ వయొలెన్స్ తీయటంలో ఆయన మాస్టర్. ఆయన సినిమాల్లో విపరీతమైన రక్తపాతం ఉంటుంది. ఆయన మొదటి సినిమా రిజర్వాయర్ డాగ్స్ నుంచి కిల్ బిల్ చూసినా జాంగో చూసినా..ఇంగ్లోరియస్ బాస్టర్డ్స్ ఏ సినిమా తీసుకున్నా విపరీతమైన హింస ఉంటుంది. కానీ దానికో పర్పస్ ఉంటుంది. HIT 3 అలాంటి పర్పస్ సరైనంత కనిపించ లేదు. పైగా ఆ ఎమోషనల్ కనెక్టెవిటీ లేకపోవటంతో డైరెక్టర్ సినిమా చూపిస్తున్నాడు మనం చూస్తున్నాం అంతే అనే మొనాటనీ వచ్చేస్తుంది కాసేపటికి. ఇప్పుడు హీరో తల నరకుతాడు వాళ్ల కాళ్లు నరుకుతాడు..ఇప్పుడు చిన్న పిల్లాడిని చంపాలి చంపుతాడా లేదా అన్నీ తెలిసి పోతుంటాయి. పోనీ తెలిసిపోయేలా రాసుకున్నా బలమైన ఎమోషన్ ఉంటే అది క్యారీ చేయొచ్చు.
టరంటినో సినిమాలో ఫాలో అయ్యే రూల్ ఒకటి ఉంటుంది. బిల్డప్ అండ్ పే ఆఫ్. హిట్ 3 వరల్డ్ ని చాలా సేపు బిల్డ్ చేశారు. ఫస్ట్ ఆఫ్ అంతా ఏ పని దేనికి చేస్తున్నాడు ఎందుకు చేస్తున్నాడు అంటూ వన్ బై వన్ రిలీవ్ చేసుకుంటూ వెళ్లారు. కానీ పే ఆఫ్ దగ్గరికి వచ్చేప్పటికి ఆ ఎమోషన్ పండలేదు. ఎమోషనల్ కనెక్టవిటీ లేకపోవటం, స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్ లేకపోవటంతో నాని స్క్రీన్ మీద ఎంత కష్టపడుతున్నా అధి అడవి కాచిన వెన్నెలా అయిపోయింది. ఫర్ ఫార్మెన్స్ పరంగా నాని బాగా చేశాడు. క్యారెక్టర్ నుంచి బయటకు రాకుండా ఉండేందుకు ఆయన పడిన స్ట్రగుల్ ..త్రూ అవుట్ సినిమా అంతా కనపడింది. క్యామియోస్ ఉంటాయి రెండు ఆకట్టుకున్నాయి. కానీ అసలు నాని రోల్ కే ఓ బలమైన పర్పస్ లేకుండా చేశాడు డైరెక్టర్ శైలేష్ కొలను . పోనీ రివీల్ చేస్తున్న చోటైనా అందరికీ అర్థమయ్యేలా మాట్లాడుకుంటారా అంటే కాదు స్వతహాగా శైలేష డాక్టర్ కావటంతో ఆయనకొచ్చిన టెర్నినాలజీ అంతా రాసుకుని వాళ్లతోనూ అవే మాట్లాడిస్తాడు. చూసే ఆడియెన్ ఎందుకు కనెక్ట్ అవుతాడు వాడెప్పుడో సినిమా చూడట మానేసి ఫోన్ నొక్కుతూ కూర్చుంటాడు. శ్రీనిధి శెట్టి ఉంది..కానీ తననే ఎందుకు అనిపించింది నాకైతే. పాటలు అయితే అవసరం లేదు ఈ సినిమాకు. కానీ భరించాలి తప్పదు. సో శైలేష్ అయితే తన పాత నెరేటివ్ స్టైల్ కైనా వెళ్లిపోవాలి లేదంటే నాని మాస్ సినిమాల్లో అన్ని జాగ్రత్తలు తీసుకునైనా నటించాలి. లేదంటే HIT 3 లానే హాఫ్ కుక్డ్ బిర్యానీలా అయిపోతుంది. ఈ సినిమాలో ఫెయిల్ అయ్యింది కదాని నాని కి మాస్ సెట్ అవ్వదు మనం చెప్పేయలేం. కానీ రుద్దొద్దు. నాని నే అంటాడు సినిమాలో..ఎవరో క్లాస్ అంటే..అందరూ అలా అనుకునే మోసపోతున్నారు ఈసారి ఒరిజినల్ చూపిస్తా అని. ఒరిజినల్ రక్తపాతం మాత్రమే కాదు నీ భయ్యా నీ ప్రశ్నే..పర్పస్ ఏంటీ..అది నీకు డైరెక్టర్ కి మాత్రమే కాదు..స్క్రీన్ ప్లేలో..కథలో ఉండి..ఆడియెన్స్ మీతో పాటు కథలో ప్రయాణించేలా చేయాలి..అప్పుడే పర్పస్.





















