Mohan babu Attack Media | మీడియా ప్రతినిధిని దారుణంగా కొట్టిన మోహన్ బాబు | ABP Desam
మోహన్ బాబు దాడి చేశారు. క్రమ శిక్షణ అని ఎప్పుడూ చెప్పే మోహన్ బాబు మీడియా ప్రతినిధిపై నిర్దాక్షిణ్యంగా దాడి చేశారు. చేతిలో మైకు లాక్కుని మీడియా ప్రతినిధి తలపైనే మైకుతో గట్టిగా కొట్టారు. పక్కనే పోలీసులు ఉన్నారని కూడా ఆలోచించలేదు మోహన్ బాబు. రెండు రోజులగా ఇంట్లో గొడవలతో విసిగిపోయి ఉన్నారేమో ఆ కసినంతా మీడియాపై చూపించారు. మనోజ్ పోలీసుల చుట్టూ తిరుగుతున్నారు. తనకు ప్రాణ హాని ఉందంటూ కంప్లైంట్ లు ఇస్తున్నారు. మోహన్ బాబు కూడా పోలీస్ కమిషన ర్ కు ఫిర్యాదు చేశారు ప్రాణహాని ఉందని. అది కచ్చితంగా మీడియా కవర్ చేయాల్సిన విషయమే. కానీ మోహన్ బాబు ఇలా దాడి చేయటంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సినీ నటుడు మోహన్ బాబు కుటుంబంలో ఏర్పడిన వివాదాలు రచ్చకెక్కి చివరకు ఉద్రిక్త పరిస్థితులకు దారి తీశాయి. జల్ పల్లిలో మోహన్ బాబు నివాసం వద్ద తీవ్ర ఘర్షణ జరిగింది. ముందుగా మంచు మనోజ్ ను ఇంట్లోకి రానివ్వకుండా అడ్డుకున్నారు పోలీసులు, మోహన్ బాబు బౌన్సర్లు. గేటు దగ్గర నిలబడి తనను లోపలికి రానివ్వాలని మనోజ్ ఎంత బతిమాలినా సెక్యూరిటీ లోపలికి వెళ్లనివ్వలేదు. దీంతో మనోజ్ గేట్లు విరగొట్టే ప్రయత్నం చేశారు. తీవ్ర పెనుగులాట తర్వాత మనోజ్ లోనికి వెళ్లారు. మనోజ్ కోసం బయటకు వచ్చిన మోహన్ బాబు మీడియా మాట్లాడించేందుకు ప్రయత్నం చేయగా మీడియా ప్రతినిధులపై దాడి చేశారు మోహన్ బాబు