Jr NTR in Kantara 3 | కాంతార 3’లో తారక్ ? | ABP Desam
కాంతారా సినిమాతో అని భాషల ప్రజలకు దేగ్గరైన హీరో రిషబ్ శెట్టి. ఈ మూవీతో వన్ నైట్ లోనే స్టార్ అయిపోయాడు. ఎలాంటి అంచనాలు లేకూండా వచ్చిన కాంతారా సినిమా కాసుల వర్షం కురిపించింది. దాంతో ఈ సినిమాకి ప్రీక్వెల్ ని ప్లాన్ చేసాడు రిషబ్ శెట్టి. కాంతార 2 ఇంకా విడుదల కాకుండా మూడో పార్ట్ ను కూడా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. కాంతార 3లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒక స్పెషల్ రోల్ లో కనిపించబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఇదే నిజమైతే కాంతారా మూవీ మరోస్థాయికి చేరడం ఖాయం. రిషబ్ శెట్టి, ఎన్టీఆర్ మంచి స్నేహితులు అని అందరికి తెలుసు.
‘వార్ 2’ సినిమా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్న ఎన్టీఆర్.. కాంతారా 3 సినిమాతో కన్నడలోకి కూడా అడుగుపెట్టడానికి రెడీగా ఉన్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ .. ప్రశాంత్ నీల్‌తో ఒక సినిమా చేస్తున్నారు. దేవర 2 షూటింగ్ కూడా త్వరలోనే ప్రారంభం కానుంది. అలాగే త్రివిక్రమ్ తో కూడా ఎన్టీఆర్ సినిమా చేయబోతున్నారని టాక్ వినిపిస్తుంది. ఇంత బిజీ టైంలో ఎన్టీఆర్ కాంతారా 3 లో నటిస్తారో లేదో చూడాలి.



















