Electric Cycle: పెట్రోల్ తో పనిలేని స్కూటర్.. క్షణాల్లో త్రెడ్ మిల్లర్.. మారుతోంది సైకిల్ గా
రోజురోజుకు పెట్రోల్ ధరలు ఆకాశాన్ని తాకడంతో విసిగిపోయిన ప్రజలు పెట్రోల్ వినియోగానికి స్వస్తి పలికి ప్రత్యామ్నాయాల వైపు దృష్టి సారిస్తున్నారు .ఈ మధ్య విస్తృతంగా ప్రచారం అయిన ఎలక్ట్రికల్ బైకుల వైపు మొగ్గుచూపుతున్నారు .అయితే అనంతపురంలో స్కూటర్ కమ్ సైకిల్ లా ఉపయోగించే వాహనాలను దిగుమతి చేసుకుంటూ తమ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. వీలున్నప్పుడు సైకిల్ గా వాడుకోవచ్చు లేదా ఒక్క స్విచ్ నొక్కి స్కూటర్ గా మార్చేసి రయ్ మంటూ దూసుకెళ్లి పోవచ్చు. లైసెన్స్ , రిజిస్ట్రేషన్ అవసరం లేని ఈ వాహనాలకు ఇప్పుడు మార్కెట్లో గిరాకీ పెరిగింది. ఒక్కసారి చార్జింగ్ చేస్తే 40 కిలోమీటర్ల వరకు ఏ అడ్డంకులు లేకుండా వెళ్లిపోవచ్చు .అలాగే సైకిల్ ఫెడల్ తొక్కితే చార్జింగ్ అయ్యే వెసులుబాటు కూడా ఈ వాహనానికి ప్రత్యేకత గా నిలుస్తోంది.





















