YS JAGAN: వైఎస్ వివేకా హత్యపై టీడీపీ విమర్శలకు స్పందించిన సీఎం జగన్
చంద్రబాబు భావోద్వేగం పై సీఎం జగన్ అసెంబ్లీలో స్పందించారు. తన కుటుంబం గురించి చంద్రబాబు ఎన్నో వ్యాఖ్యలు చేశారని జగన్ అన్నారు. తన చిన్నాన్న వైఎస్ వివేకా గురించి మాట్లాడుతున్నారని...వైఎస్ వివేకా తనకు బాబాయ్ అయితే....అవినాష్‌రెడ్డి మరో చినాన్న కొడుకని... ఒక కన్ను మరో కన్నును ఎందుకు పొడుస్తుందని జగన్ ప్రశ్నించారు. ఇవన్నీ జరిగింది చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలోనేనని తన చినాన్నను ఓడించేందుకు చంద్రబాబు కుట్రలు చేశారన్నారు. ఎంపీటీసీలు, జెడ్పీటీసీలను ప్రలోభాలు పెట్టి అక్కడ ఎమ్మెల్సీ సీటు కోసం తన చినాన్నను ఓడించారని జగన్ అన్నారు. అంతటి దారుణంగా వ్యవహరించిన వాళ్లే తన చినాన్నను ఏమైనా చేసి ఉంటారని సీఎం జగన్ అభిప్రాయపడ్డారు.





















