RK Roja on Singayya Case | సీఎం చంద్రబాబుపై రోజా కామెంట్స్
మాజీ మంత్రి ఆర్. కే.రోజా కూటమి ప్రభుత్వంపై విరుచుకు పడ్డారు. జగన్ కాన్వాయ్ కిందపడి మృతి చెందిన సింగయ్య కేసుపై స్పందించారు మాజీ మంత్రి రోజా. జగన్ ప్రజాదరణ చూసి ఓర్వలేక చంద్రబాబు ఇలా కుట్రలు చేస్తున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం కక్ష్య సాధింపు చర్యలుకు పాల్పడుతున్నారని అన్నారు రోజా. కల్తీ నెయ్యి ఘటనలో ఈవో ముందు నిజాలు మాట్లాడిన తర్వాత మాట్లాడించారు, ఆ తర్వాత వారం రోజుల్లో ఎలా వెంటనే మాట మార్చారు అనేది ప్రజలు గమనించారు అంటూ చంద్రబాబుపై విరుచుకుపడ్డారు రోజా. ఫ్లైట్ కుప్ప కూలిన ఘటనపై కేంద్ర మంత్రి రామ్మోహన్ పై ఎందుకు కేసు పెట్టలేదు, సింహాచలం గోడ ఘటనలో అద్భుతమైన ఏర్పాట్లు చేశాం అన్న హోం మంత్రి... గోడ కూలిన భక్తులు చనిపోయిన ఘటనపై హోం మంత్రిపై ఎందుకు కేసు నమోదు చేయలేదు అని ప్రశ్నించారు.
ఏడాది పాలనలో మీ ప్రభుత్వంలో ప్రజలు మీటింగ్ లకు రావడం లేదు. జగన్ అన్న మీటింగలకు పొలాల్లోంచి పరుగులు పెడుతున్నారు
మానవత్వం లేని వాళ్లు మీరు, మీ కుమారుడు, అబద్ధాలతో ఓట్లు వేయించుకున్నారు అంటూ కూటమి పార్టీపై మండిపడ్డారు రోజా.





















