(Source: ECI/ABP News/ABP Majha)
RK Roja on CM Chandrababu | పుంగనూరు బాలిక కిడ్నాప్, హత్య కేసుపై మాజీ మంత్రి ఆర్కే రోజా | ABP Desam
పుంగనూరులో ఓ బాలిక కిడ్నాప్, హత్యకు గురైన ఘటనపై మాజీ మంత్రి ఆర్కే రోజా స్పందించారు. గత నెల 29న చిన్నారి అదృశ్యమైనా నాలుగు రోజుల పాటు ఆ పాప జాడ కనిపెట్టలేకపోయారని..ఇప్పుడు ఆ పాపను హత్య చేస్తే నిందితులెవరో గుర్తించలేని పరిస్థితిలో ఉన్నారంటూ రోజా మండిపడ్డారు. తక్షణం పుంగనూరు ఘటన నిందితులను అరెస్ట్ చేయాలని రోజా డిమాండ్ చేశారు.ముఖ్యమంత్రి సొంత చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో ఏడేళ్ల పాప ను కిడ్నాప్ చేసి కిరాతకం గా హత్య చేసిన ఉదంతం గుండెను పిండేస్తోందన్నారు రోజా. ఆడపిల్లలు ఉన్న తల్లితండ్రులు పిల్లలను స్కూల్ కి పంపాలంటే భయమేస్తోందన్న మాజీ మంత్రి ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే రక్షణ లేకపోతే ప్రభుత్వ అసమర్ధత కాదా అని ప్రశ్నించారు. గత నెల 29 న అదృశ్యమైన పాప నాలుగు రోజులపాటు ఆ సమీప ప్రాంతాల్లో నే ఉన్నా ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా గుర్తించలేకపోయారని విమర్శించారు ఆర్కే రోజా.