Rama Samudram Rama Sita Well | నంద్యాల జిల్లాలో ఈ అత్యంత పవిత్రస్థలం కథ మీకు తెలుసా.? | ABP Desam
రాముడు సీత నిద్రించిన స్థలం ఎక్కడో మీకు తెలుసా. నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం పరిధిలో జూపాడు బంగ్లా మండలంలో రామసముద్రం గ్రామంలో రాముడు సీతా నిద్రించిన స్థలం ఇక్కడే ఉందని గ్రామస్తులు విశ్వసిస్తారు. సంతానం లేని వారు బావి నీరుతో ఒకప్పుడు స్నానం చేస్తే సంతాన కలిగేది అని నమ్ముతారు. అంతే కాదు ఇది వరకటి రోజుల్లో చుట్టుపక్కల గ్రామస్తులు అందరూ వచ్చి ఇక్కడ నిదిరించి స్నానాలు ఆచరిస్తూ ఉండేవారని చెబుతుంటారు. అంతటి ప్రాముఖ్యత ఉన్న నంద్యాల జిల్లా జూపాడు బంగ్లా మండలంలోని రామసముద్రం గ్రామస్తులకు పాములు కరిచిన, తేలు కరిచిన ఇప్పటిదాకా ఎలాంటి ప్రాణహాని జరగలేదని వీటంతటికి కారణం ఆ బావేనని నమ్ముతారు. అయితే ప్రస్తుతం రాముడు సీత నిదిరించి స్నానాలు ఆచరించిన బావి శిధిల వ్యవస్థలో ఉంది. ఈ బావిలో నీరును తాగిన, స్నానాలు ఆచరించిన సకల ఆరోగ్య సమస్యలు నయమైపోయేవి అంటున్న గ్రామస్తులు నేటికి కనిపిస్తున్నా ఈ చారిత్రక ప్రదేశం నిర్లక్ష్యానికి లోవుతూ వస్తోంది.





















