ఇడుపులపాయ టూ వెలగపూడి పాదయాత్ర భగ్నం
విదేశీ విద్యార్థులకు న్యాయం చేయాలని కడప జిల్లా ఇడుపులపాయ లో ఉన్న దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఘాట్ వద్ద విదేశాల్లో చదువుకుంటున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఆర్జీ ఇచ్చి కొద్ది సేపు మౌనం పాటించారు. అనంతరం వైఎస్ఆర్ ఘాట్ నుంచి వారు పాదయాత్రగా వెలగపూడికి బయలుదేరారు. ఈ విషయం తెలుసుకున్న ఇడుపులపాయ ఆర్కే వ్యాలీ పోలీసులు వారి పాదయాత్రకు అనుమతి లేని కారణంగా అడ్డుకున్నారు. విదేశీ విద్యార్థులకు స్కాలర్ షిప్ లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రిని కలిసేందుకు శాంతియుతంగా చేపడుతున్న పాదయాత్ర ను పోలీసులు అడ్డుకోవడం సమంజసం కాదని చెప్పారు. రోడ్డు పైనే కూర్చుంటామని భీష్మించుకున్నారు. ముఖ్యమంత్రిని కలిసి తమ సమస్యలు చెప్పుకోవడానికే పాదయాత్ర చేస్తున్నట్లు విదేశీ విద్యా విద్యార్థుల తల్లిదండ్రులు ఎస్ఐ వద్ద వాపోయారు. అనుమతి ఉంటేనే పాదయాత్రగా వెళ్ళాలి లేకపోతే పాదయాత్ర గా వెళ్ళడానికి వీలు లేదని ఆర్కే వ్యాలీ ఎస్ఐ రంగారావు చెప్పారు. పాదయాత్ర చేస్తున్న విద్యార్థులు తల్లిదండ్రులను అడ్డుకుని ఆటో ఎక్కి పంపించారు.