Nellore SP Serious : ఇంచార్జ్ గా ఉన్న హెడ్ కానిస్టేబుల్ పై క్రమశిక్షణ చర్యలు | ABP Desam
Nellore జిల్లాలో సచివాలయం మహిళా పోలీసులకు యూనిఫామ్ కొలతలు తీసుకునే విషయంలో పురుషులను అనుమతించడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేగింది. దీంతో నెల్లూరు జిల్లా పోలీసులు హడావిడి పడ్డారు. SP Vijaya Rao, అడిషనల్ SP వెంకటరత్నమ్మ.. ఈ ఘటనపై సీరియస్ అయ్యారు. యూనిఫామ్ కొలతలు తీసుకుంటున్న ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్ లోకి వెళ్లి పరిస్థితి సమీక్షించారు. టైలర్ మెజర్ మెంట్స్ తీసుకునే దగ్గర ఇంచార్జ్ గా ఉన్న హెడ్ కానిస్టేబుల్ పై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం మహిళలతోనే అక్కడ కొలతలు తీసుకుంటున్నారు. కొంతమంది కావాలని వీడియోలు వైరల్ చేస్తున్నారని, మహిళా కానిస్టేబుళ్లకు తెలియకుండా వారి యూనిఫామ్ కొలతలు తీసుకునే సమయంలో ఫొటోలు వీడియోలు తీశారని, వారిపై కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు.





















