నెల్లూరులో 8మంది ప్రాణాలు కాపాడిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది..
నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఉన్నట్టుండి వరదనీరు పోటెత్తడంతో కొన్ని గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో మనుబోలు గ్రామం సమీపంలోని హరిజనవాడకు చెందిన ఎనిమిదిమంది వ్యక్తులు పొలం పనులకోసం వెళ్లారు. అయితే అకస్మాత్తుగా వరదనీరు పెరగడంతో వారంతా పొలంలోనే చిక్కుకుపోయారు. స్థానిక నాయకులు ఆ సమాచారం అందుకుని వెంటనే అధికారులను అప్రమత్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి కూడా ఉన్నతాధికారులకు చెప్పడంతో.. వెంటనే ఎన్డీఆర్ఎఫ్ టీమ్ రంగంలోకి దిగింది. స్పీడ్ బోట్ లో వెళ్లి ముందుగా వారికి లైఫ్ జాకెట్లు అందించి అందర్నీ బోట్ లో వెనక్కి తీసుకొచ్చారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు




















