Pawan Kalyan Winnning From Pithapuram | కోస్తాంధ్రలో కూటమిదే హవా..!
కోస్తా మొత్తం కూటమి వైపే ఉందని..రాయలసీమలోనూ వైసీపీని భూస్థాపితం చేస్తామని జనసేనాని ఎన్నికల ప్రచారంలో అన్నారు. 175 సీట్లలో 151 జగన్ కే..! చంద్రబాబుకు వయసైపోతోంది. ఆయనను జైలులో పెట్టారు. లోకేశ్ దిల్లీ బాట పట్టారు. టీడీపీ క్యాడర్ అంతా నిరాశలో ఉంది. లోకేశ్ ఇంకా ఆ స్థాయిలో ఎస్టాబ్లిష్‌మెంట్ కాలేదు. గవర్నమెంట్ ఎంత నెగెటివిటీ ఉన్నా.. 60 సీట్లు తగ్గినా మరోసారి జగన్ దే అధికారం. వార్ వన్ సైడ్ అనుకుంటున్న తరుణంలో.. ఒక్కడు ఎంటరై కథ మొత్తం మార్చేశాడు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అంటూ శపథం చేసి... ఊపిరి ఆగుతున్న టీడీపీకి సంజీవనిలా.. బలమైన కూటమి ఏర్పాటు చేసే పరశురాముడిలా.. మార్పు కోరుకుంటున్న జనాలకు ఆశదీపంగా మారాడు. వ్యుహమెస్తే వ్యతిరేక ఓటు అంతా ఒక్కటైంది. ఆకాశంలో ఉన్న వైసీపీని నేలకు దింపి..పాతాళంలో కూటమిని అందలమెక్కించాడు. అతడే..పవర్ స్టార్ పవన్ కల్యాణ్..! పవర్ ఉన్నోడు కాదు... బలహీనంగా ఉన్న వర్గానికి పవర్ అందించేటోడే నిజమైన పవర్ స్టార్. అదే జనసేనాని పవన్ కల్యాణ్..!