Minister Kannababu: తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలంలో మంత్రి కన్నబాబు పర్యటన
తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు మండలం కొత్తూరు, కలవచర్ల, గుమ్మిలేరు లలో మంత్రి కన్నబాబు పర్యటించారు. ప్రభుత్వ విప్ చిర్ల జగ్గారెడ్డితో కలిసి తిరిగిన ఆయన వర్షాలకు ముంపునకు గురై న పంట చేలను పరిశీలించారు. రాయలసీమ, నెల్లూరు జిల్లాలకు 80% సబ్బిసిడి పై విత్తనాలను రైతులకు ప్రభుత్వం అందచేస్తుందన్న ఆయన...వచ్చే రబీ పంటకు నీటి ఎద్దడి ఉన్నా ప్రతీ ఎకరాకు ఎన్నిఇబ్బందులు ఎదురైనా నీరు అందిస్తామన్నారు. వర్షాలతో నష్టపోయిన కౌలురైతులకు భూయజమానులు పెద్దమనసు చేసుకొని సహకరించాలి. ప్రభుత్వం ఇచ్పే ప్రోత్సాహకాలు కౌలురైతులకు అందజేయాలి. ప్రతిపక్షం ప్రతీదానిని రాజకీయం చేయాలని చూస్తుంది. ప్రభుత్వం రైతుప్రభుత్వం రైతుల కష్టాలను గుర్తిస్తుందన్నారు.





















