Minister Narayana Surprise Visit in Vijayawada | మంత్రి నారాయణ ఆకస్మిక పర్యటన
ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాలకు రెడ్, ఆరంజ్ అలెర్ట్ ను జారీ చేసారు అధికారులు. సీఎం చంద్రబాబు వర్షాలపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో విజయవాడ నగరంలో మంత్రి నారాయణ ఆకస్మిక పర్యటన చేసారు. కమిషనర్ ధ్యాన చంద్ర తో కలిసి వర్షంతో జలమయమైన ప్రాంతాలను పరిశీలించారు. నగరంలో డ్రెయిన్లు ఆక్రమణలకు గురికావడంతో చాలా ప్రాంతాల్లో రోడ్లు జలమయం అయ్యాయి. వర్షాలు తగ్గిన వెంటనే విజయవాడలో ఆక్రమణలు తొలగించి డ్రైనేజీ వ్యవస్థను పూర్తిగా అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. నగరంలో డ్రెయిన్లు ఆక్రమణలకు గురికావడం తో చాలా ప్రాంతాల్లో రోడ్లు జలమయం అయ్యాయి. నీరు నిలిచిన ప్రాంతాల్లో మున్సిపల్ సిబ్బంది అత్యవసర చర్యలు చేపట్టారు. వర్షాలు తగ్గిన వెంటనే విజయవాడలో ఆక్రమణలు తొలగించి డ్రైనేజీ వ్యవస్థను పూర్తిగా అందుబాటులోకి తీసుకొస్తాం. వచ్చే వర్షా కాలం నాటికి నగర వాసులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తాం. బుడమేరు వరద వస్తుందని జరుగున్న ప్రచారంలో వాస్తవం లేదు అని అన్నారు మంత్రి నారాయణ





















