Madhuri Duvvada Srinivas | Adultery Law Expalined | మాధురి, దువ్వాడల బంధం..చట్టం ఏం చెబుతోంది..?
Madhuri Duvvada Srinivas | Adultery Law Expalined |
విన్నారు కదా..! ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, మాధురిలు చేస్తున్నది సహజీవనం కాదట.. అడల్ట్రీ అంటా..! అసలు ఏంటీ ఈ అడల్ట్రీ. చట్టం ఏం చెబుతోంది అన్నది ఇప్పుడు తెలుసుకుందాం..! అడల్టరీ కి చాలా డెఫిషన్సే గూగుల్ లో కనిపిస్తున్నాయి. కానీ, సింపుల్ గా చెప్పాలంటే..! విడాకులు ఇవ్వకుండానే పెళ్లి ఐనా ఓ స్త్రీ, పెళ్లి ఐన వేరే వ్యక్తితో కలిసి ఉండటాన్నే అడల్ట్రీగా చెప్పుకోవచ్చు. మరి ఇది చట్టపరంగా తప్పు కాదా అంటే తప్పే..! ఇండియన్ పినల్ కోడ్ 1860 ప్రకారం ఇది నేరం. సెక్షన్ 497 ఏం చెబుతుంది అంటే..! ఇలా ఇద్దరు వివాహేతర సంబంధం పెట్టుకుంటే నేరంగా పరిగణిస్తారు. సంబంధం పెట్టుకున్న వ్యక్తికి మ్యాక్సిమమ్ 5 ఏళ్ల వరకు జైలు శిక్ష లేదా ఫైన్ విధిస్తారు. కొన్ని సందర్భాల్లో రెండూ విధించవచ్చు. ఐతే.. ఈ చట్టాన్ని 2018లో సుప్రీం కోర్టు కొట్టివేస్తూ సంచలన తీర్పు ఇచ్చింది.