Tirumala: శ్రీవారి సేవలో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా.. మొక్కులు చెల్లింపు
లోక్‌సభ స్పీకర్ ఓం ప్రకాష్ బిర్లా తిరుమలకు విచ్చేశారు. కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు. టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఎంపీలు విజయసాయి రెడ్డి, మిధున్‌రెడ్డి, మార్గాని భరత్, గురుమూర్తి స్వామి సైతం ఓం బిర్లాతో పాటు శ్రీవారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు. కోట్లాది హిందువుల ఆరాధ్యదైవం శ్రీ వేంకటేశ్వరస్వామి అని లోక్‌సభ స్పీకకర్ అన్నారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. శ్రీవారి ఆశీస్సులు తీసుకున్నందుకు సంతోషంగా ఉందన్నారు. కరోనా నుండి ప్రజలకు త్వరలో విముక్తి కలగాలని, శ్రీవారి దయతో అంతా మంచి జరుగుతుందన్నారు. తిరుమలలో భక్తులకు టీటీడీ సౌకర్యాలపై సంతృప్తి వ్యక్తం చేశారు.





















