మ్యాథమాటిక్స్ లో గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించిన గురు శంకర్
మోస్ట్ డెసిమల్ ప్లేసెస్ ఆఫ్ నెంబర్ మ్యాథమాటిక్స్ లో గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించాడు కడప జిల్లా రైల్వే కోడూరుకు చెందిన యువకుడు గురు శంకర్. ఈ సందర్భంగా గురు శంకర్ మాట్లాడుతూ ఈ నెల 15 వ తేదీన గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించడానికి ప్రయత్నం చేయడం జరిగిందని, తొలి ప్రయత్నం విజయవంతం అయ్యి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ వెబ్సైట్ లో ధ్రువీకరించారన్నారు. ఈ రికార్డు చేయడానికి ఏడాది పాటు విశేష కృషి చేసి శ్రమించానన్నారు. ఈ రికార్డు మ్యాథమాటిక్స్ కు సంబంధించిన అయిలర్స్ నంబర్ల గురించి చేశారని , గత 5005 రికార్డు ను క్రాస్ చేసి 7777 డేసిమల్ నంబర్లను వరుస క్రమంలో గుర్తుపెట్టుకొని విజయం సాధించి తన తండ్రి తుమ్మల శివయ్య కు ఈ విజయాన్ని అంకితం చేసారు.





















