Kadapa PRC JAC : రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమ కార్యచరణ ప్రణాళికను సిద్ధం చేస్తున్నాం | ABP Desam
ఏపీ చీఫ్ సెక్రెటరీ అంకెల గారడీతో ఉద్యోగస్తుల లను దారుణంగా వంచించారని పీఆర్సీ స్ట్రగుల్ కమిటీ కడప జేఏసీ కార్యదర్శి చంద్రశేఖర్ ఆరోపించారు. కడప నగరంలో పీఆర్సీ స్ట్రగుల్ కమిటీ రౌండ్ టేబుల్ సమావేశంలో వివిధ సంఘాల ఉద్యోగ సంఘ నాయకులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు రానున్న కాలంలో ఉద్యమ కార్యాచరణ ప్రణాళిక ను సిద్ధం చేస్తున్నామన్నారు. పీఆర్సీ పెంచిన ప్రభుత్వాలే చూశామని, ప్రస్తుత ప్రభుత్వం యూ టర్న్ ప్రభుత్వమన్నారు. భవిష్యత్తులో ఉద్యోగస్తుల ఆగ్రహాన్ని ప్రభుత్వం చవిచూస్తుందన్నారు. హెచ్.ఆర్.ఏ తగ్గించి పల్లెల్లో పట్టణాల్లో ఉండే అందరికి సమానంగా ప్రభుత్వం ఇవ్వడం తగదన్నారు.





















