Kadapa Floods: కడప జిల్లా చెయ్యేరు నదికి వచ్చిన వరదల్లో 40కుటుంబాలను రక్షించిన ఒకే ఒక్కడు
కడపజిల్లా చెయ్యేరు నదీపరివాహక ప్రాంతంలో వరదల సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. ఇప్పటికీ ఆ విపత్తు సృష్టించిన ఉత్పాతంలోనే మిగిలిపోయిన గ్రామాలు ఆ కాళరాత్రులను తలుచుకుని నేటికీ వణికిపోతున్నాయి. నందలూరు మండలం తొగూరుపేటలో ఓ సాధారణ గ్రామస్తుడు మూడు పల్లెల జనాల ప్రాణాలను కాపాడిన ఆపద్బాంధవుడిలా ప్రశంసలు అందుకుంటున్నారు. తొగూరుపేటకు చెందిన శివరామయ్య....వరద విపత్తును ఊహించి మూడు గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. అంతే కాదు వారందరినీ సురక్షిత ప్రాంతమైన దాసాలమ్మ గుట్టకు తీసుకెళ్లి ప్రాణాలను రక్షించుకోవటంలో సహాయపడ్డారు. పైకి ఎక్కలేని వాళ్లను తన భుజాలపై మోసి ఆ గ్రామస్తుల దృష్టిలో హీరోగా నిలిచిపోయిన శివరామయ్య తో మా ప్రతినిధి శ్రీకాంత్ ముఖాముఖి.





















