Jahnavi Dangeti Biography | అంతరిక్ష యాత్రకు ఆస్ట్రోనాట్ గా ఎంపికైన జాహ్నవి దంగేటి | ABP Desam
అంతరిక్షంలోకి వెళ్లేందుకు ఓ అచ్చ తెలుగు అమ్మాయికి అవకాశం దక్కింది. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన 23 ఏళ్ల దంగేటి జాహ్నవి అంతరిక్షంలోకి అడుగుపెడుతున్న తొలి భారతీయ మహిళా ఆస్ట్రోనాట్ గా రికార్డు సృష్టించనుంది. అమెరికాకు చెందిన టైటాన్ స్పేస్ ఇండస్ట్రీస్ చేపట్టిన స్పేస్ మిషన్ కోసం ఆస్ట్రోనాట్ గా తనను ఎంపిక చేసినట్లు జాహ్నవి దంగేటి తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు. ఆస్ట్రోనాట్ కాండిడేట్ ASCANగా జాహ్నవి ఎంపిక జరిగింది. 2029లో జరగబోయే తొలి అంతరిక్ష యాత్రలో ఐదు గంటల పాటు జాహ్నవి రోదసిలో గడపనున్నారు. అందులో మూడు గంటల పాటు జీరో గ్రావిటీ ని అనుభవిస్తూ గాల్లో తేలేలా ట్రైనింగ్ తీసుకుంటున్నారు. భవిష్యత్తులో ఓ స్పేస్ స్టేషన్ ను ఏర్పాటు చేయాలని..స్పేస్ టూరిజం ను అభివృద్ధి చేయాలని టైటాన్ స్పేస్ భావిస్తుండగా ఆస్ట్రోనాట్స్ తో పాటు స్పేస్ టూరిస్టులకు ఆహ్వానం పలుకుతోంది. జాహ్నవి లాంటి ఆస్ట్రోనాట్స్ తో పాటు మనమూ ప్రయాణించాలంటే పదిలక్షల యూఎస్ డాలర్లు ఎనిమిది కోట్ల 35 లక్షలు చెల్లించాల్సి ఉంటుందని టైటాన్ స్పేస్ పబ్లిసిటీ చేసుకుంటోంది.




















