Disha Act: ఏపీలో దిశా చట్టం ఉందా..? వాస్తవ పరిస్థితి ఏంటంటే..
" దిశా చట్టం" ఆంధ్రప్రదేశ్‌లో ఓ మిస్టీరియస్ సబ్జెక్ట్. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ చట్టం అమలుపై విరివిగా సమీక్షలు చేస్తూంటారు. హోంమంత్రి లాంటి వాళ్లు ఆ చట్టం కింద కేసులు నమోదు చేస్తున్నామంటారు. ముగ్గురికి ఉరి వేశామని నిర్మోహమాటంగా చెబుతూంటారు. డీజీపీ వంటి వాళ్లు దిశ చట్టం పకడ‌్బందీగా అమలవుతోందంటారు. ఇక కింది స్థాయి పోలీసుల గురించి చెప్పాల్సిన పని లేదు. దిశ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని అసువుగా చెబుతూంటారు. దిశ పేరుతో పోలీస్ స్టేషన్లు ఏర్పాటయ్యాయి. దిశ పేరుతో యాప్ కూడా నడుస్తోంది. పైకి మొత్తం "దిశ" మయం. కానీ నిజంగా ఆ చట్టం ఉందా..? ఆ చట్టం పరిస్థితి ఏమిటి..? రాష్ట్రపతి సంతకానికి ఎంత దూరంలో ఉంది..?





















