Farmer Problems: అయ్యో.. అన్నదాత.. వానొచ్చింది.. రైతన్న కష్టం నీటిపాలైంది
తూర్పుగోదావరి జిల్లా కొంకుదురు గ్రామంలో వరి చేలు మునిగిన సందర్భంలో రైతు ఆవేదన... ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వాయుగుండం కారణంగా కోనసీమ వ్యాప్తంగా భారీ వర్షాలు ముంచెత్తాయి.. దీంట్లో తీవ్రంగా వరి పంటకు నష్టం వాటిల్లింది.. ఆరుగాలం శ్రమించి పంట చేతికంది వస్తుందన్న తరుణంలో ఎలా అకాల వర్షాలు ముంచెత్తాయి.. ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్ పంటలు సంబంధించి ప్రస్తుతం వరి పంట ఈనిక దశనుంచి కోత కోసే దశ లో మరదల ఎకరాల విస్తీర్ణం ఉంది.. అకాల వర్షాల కారణంగా ఈ చేలన్నీ ముంపునకు గురై మడుల్లోనే పనలు కుళ్లిపోయే పరిస్థితి ఏర్పడింది.. దీంతో రైతులు కనీసం పెట్టిన పెట్టుబడి కూడా రాదని తీవ్రంగా ఆందోళన.. ఆవేదన వ్యక్తం చేస్తున్నారు





















