Amalapuramలో Minister విశ్వరూప్, ఎంపీ అనురాధలకు చేదు అనుభవం..
నూతనంగా ఏర్పాటు చేయనున్న కోనసీమ జిల్లాకు అంబేడ్కర్ పేరు పెట్టాలన్న నినాదంతో అమలాపురంలో నిర్వహించిన దీక్షలో ఒక్కసారిగా గందరగోళ పరిస్థితి ఏర్పడింది.ఈ కార్యక్రమానికి సంఘీభావంగా రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి విశ్వరూప్, అమలాపురం ఎంపీ చింతా అనురాధ హాజరయ్యారు. ఈసందర్భంగా నాయకులు మాట్లాడుతున్న క్రమంలో విద్యార్థి సంఘ నాయకుడు తిరుపతిరావు అవసరమైతే రాజీనామా చేయాలన్న మాటతో ఈ పరిణామానికి వేదికపైనున్న మంత్రి, ఎంపీ తోపాటు పలువురు నాయకులు షాక్ అయ్యినంత పని అయ్యింది. సంఘీభావం తెలిపేందుకు వచ్చిన ప్రజాప్రతినిధులను ముఖంపైనే ఇలా అనకూడదంటూ కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒక దశలో మంత్రి విశ్వరూప్ అనుచర వర్గం దీనిపై వ్యతిరేకిస్తూ మాట్లాడడంతో సభలో కాసేపు గందరగోళ పరిస్థితి ఏర్పడింది




















