Chandrababu - తిరుచానూరులో సీఎం చంద్రబాబు
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తిరుచానూరులో పద్మావతి అమ్మవారి గుడికి వచ్చారు. అక్కడ అమ్మవారి దర్శనం చేసుకున్నారు.
గత 5 ఏళ్లలో జరిగిన నష్టం అపారమని.. రాష్ట్రం 30 సంవత్సరాలు వెనక్కి వెళ్లిందని సీఎం చంద్రబాబు అన్నారు. '2047kf భారత్ ప్రపంచంలోకే మొదటి రెండు స్థానాల్లోకి వస్తుంది. 2047 విజన్‌తో ముందుకు వెళ్తాం. ఏపీ దేశంలోకే నెంబర్ 1 రాష్ట్రంగా ఉండాలి. తెలంగాణ అభివృద్ధి చెందాలి. హైదరాబాద్ అభివృద్ధి చేసిన అనంతరం ప్రపంచ దిగ్గజాలు హైదరాబాద్‌కు వచ్చాయి. దురదృష్టం వల్ల అమరావతి, పోలవరం పడకేసింది. ఈ రెండింటిని అభివృద్ధి చెయ్యాలి. సంపద సృష్టించి.. వచ్చిన సంపద పేదవాడికి ఇచ్చే కార్యక్రమం చేపట్టాలి. వాస్తవాలను చెప్పలేని దుస్థితిని మీడియా ఎదుర్కొంది. ప్రజలు ప్రభుత్వంతో భాగస్వామ్యం కావాలి.' అని చంద్రబాబు పిలుపునిచ్చారు.
దేశంలోనే ఏపీని నెంబర్ వన్ స్థానంలో నిలబెడతానని సీఎం చంద్రబాబు (CM Chandrababu) అన్నారు. గురువారం ఉదయం ఆయన సీఎం హోదాలో తొలిసారిగా తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. గతంలో ఎన్నో ఎన్నికలు చూశామని.. ఈ ఎన్నికల్లో ప్రజలు కూటమికి చారిత్రాత్మక విజయాన్ని అందించి మంచి తీర్పు ఇచ్చారని చెప్పారు.