Viral Video: కాఫీ లవర్స్‌ని చూసుంటారు, మరి కాఫీలో లవర్స్‌ని చూశారా? అదిరిపోయే డిజైన్-వీడియో వైరల్
Viral Video: కాఫీపై అద్భుతమైన డిజైన్ వేసిన వీడియోను హర్ష గోయెంక ట్విటర్‌లో పోస్ట్ చేయగా, వైరల్ అయిపోయింది.
Viral Video:
ఈ కాఫీని తాగకుండా భద్రంగా దాచుకోవాలి..
ఆర్‌పీజీ ఎంటర్‌ప్రైజెస్ చైర్మన్ హర్ష గోయెంక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. వెరైటీ కంటెంట్‌ను షేర్ చేయటం ఆయనకో సరదా. ఆయన పెట్టే ప్రతి పోస్ట్ క్షణాల్లో వైరల్ అయిపోతుంది. ఇటీవలే ఆయన తన ట్విటర్‌లో షేర్ చేసిన వీడియో ఒకటి తెగ వైరల్ అయింది. బరిస్టా కంపెనీ కాఫీని తయారు చేసిన విధానానికి నెటిజన్లు ఫిదా అయిపోయారు. ఆ డిజైన్‌ను చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. కాఫీ కప్‌లో మొదట చిక్కని పాలు పోశాడు ఓ వ్యక్తి. దానిపై చాక్లెట్ పౌడర్ చల్లాడు. దాన్ని గడ్డి, మట్టి ఆకారంలో మలిచాడు. తింక్ స్టిక్, మెల్టెడ్ చాక్లెట్‌తో చెట్టు ఆకారాన్ని గీశాడు. వాటి కిందే అబ్బాయి, అమ్మాయి బొమ్మలనూ వేశాడు. వారి పైన హార్ట్ సింబల్ వేశాడు. చివర్లో కొకొవా పౌడర్ వేశాడు. ఇదంతా అయ్యాక కప్‌ని తిప్పి చూస్తే అద్భుతమైన దృశ్యం కనిపించింది. ఓ చెట్టు కింద ఇద్దరు లవర్స్ కూర్చుని మాట్లాడుకుంటు న్నట్టుగా ఉంది ఆ డిజైన్. పేపర్‌పై గీసిన బొమ్మలాగే, ఎంతో అందంగా ఉందా డిజైన్. ఈ వీడియోను పోస్ట్ చేశారు హర్ష గోయెంక. "How I drink my cofffe" అని క్యాప్షన్ పెట్టారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు స్టన్ అవుతున్నారు. రకరకాల కామెంట్స్‌తో కామెంట్ సెక్షన్ నిండిపోయింది. "ఇలాంటి కాఫీ చేసిస్తే, ఎప్పటికీ తాగకుండా అలాగే భద్రంగా దాచుకుంటాను" అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. "ఈ కాఫీని తాగి, ఆ డిజైన్‌ను పాడుచేయాలని అనిపించటం లేదు" అని మరొకరు కామెంట్ చేశారు.
How I drink my coffee
— Harsh Goenka (@hvgoenka) July 31, 2022
pic.twitter.com/qkSDvZU1E0
Amazing singing
— Bidisha Banerjee🇮🇳 (@bidishapsgs) July 31, 2022
Wonderful coffee art.
The only worry being by the time all of this drawing completes the coffee would be cold :)
— Devi Singh (@devipsingh) July 31, 2022
If I ever get a coffee as beautiful as this, rest assured I'll preserve it. How can i ever drink a piece of art? 😃
— Syed Imtiaz Ahmed (@simtiaz_a) July 31, 2022
Also Read: Bread: రోజూ బ్రెడ్ తినడం వల్ల శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?
Also Read: Naga Chaitanya : నాగ చైతన్య నవ్వితే డేటింగ్లో ఉన్నట్టేనా? ఆమెతో ప్రేమ నిజమేనా?