Viral Video: ఈమెకింకా భూమిపై నూకలున్నాయనుకుంటా-జస్ట్ మిస్ అంతే-ఈ వైరల్ వీడియో చూశారా
నిర్లక్ష్యంగా రైలు పట్టాలు దాటుతూ తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది ఓ మహిళ. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది.
జీవితం మీదే..జాగ్రత్తగా ఉండండి: ఐఏఎస్ అధికారి సూచన
రైలు పట్టాలపై దాటే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని రైల్వే శాఖ హెచ్చరికలు చేస్తూనే ఉంటుంది. నిర్లక్ష్యంగా పట్టాలు దాటుతూ
ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తుంది. అయినా కొందరి తీరు మారదు. ఓ మహిళ ఇలాగే పట్టాలు దాటి, తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. ఓ క్షణం ఆలస్యమైనా వేగంగా దూసుకొస్తున్న రైలు కింద పడి నుజ్జునుజ్జు అయిపోయేదే. ఐఏఎస్ ఆఫీసర్ అవనీష్ శరణ్ ట్విటర్‌లో ఈ వీడియో షేర్ చేశారు. "జీవితం మీదే. నిర్ణయమూ మీదే" అనే క్యాప్షన్‌ని కోట్ చేశారు. ఆ మహిళతో పాటు ఇంకొందరు అంతే నిర్లక్ష్యంగా పట్టాలు దాటుతూ కనిపించారు. నిజానికి ట్రైన్ ప్లాట్‌ఫామ్ వద్ద ఆగలేదు. మరో ట్రైన్ క్రాస్ అవ్వటానికి స్టేషన్ రాక ముందే ఓ సిగ్నల్ వద్ద ఆగిపోయింది. ప్లాట్‌ఫామ్ వరకూ వెళ్లటం ఎందుకు అనుకున్నారో ఏమో. కొంత మంది మధ్యలోనే ట్రైన్‌లో నుంచి దిగారు. తమ సామాన్లు తీసుకుని పట్టాలు హడావుడిగా పట్టాలు దాటారు. ఇదంతా ఓ వ్యక్తి వీడియో తీశాడు.
ज़िंदगी आपकी है. फ़ैसला आपका है. pic.twitter.com/eMrl65FiCj
— Awanish Sharan (@AwanishSharan) July 19, 2022
కాస్త ఆలస్యమైనా...
ట్రైన్ సమీపిస్తుండటాన్ని గమనించిన ఆ వ్యక్తి వెంటనే అందరినీ అప్రమత్తం చేశాడు. అప్పటికే పట్టాలపై ఉన్న వాళ్లు వేగంగా పక్కకు తప్పుకున్నారు. కొందరు అటు ఇటు అంటూ కన్‌ఫ్యూజ్ చివరకు ఓ చోటకు వెళ్లారు. ఓ మహిళ మాత్రం అప్పటి వరకూ ఓ వైపు ఉండి, సరిగ్గా ట్రైన్ వచ్చే సమయానికి ఇటు వైపు దూకింది. రెప్పపాటులోనే రైలు వేగంగా దూసుకుపోయింది. కాస్త ఆలస్యమయ్యుంటే అక్కడికక్కడే ఆ మహిళ మృతి చెంది ఉండేది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. "ఇలాంటి పనులు చేయకూడదని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను" అని ఐఏఎస్ ఆఫీసర్ అవనీష్ శరణ్ అన్నారు. ఇక నెటిజన్లైతే ఆ ప్రయాణికులను తిట్టి పోస్తున్నారు. "ఇంత నిర్లక్ష్యంగా ఉంటారా" అని తీవ్రంగా మండి పడుతున్నారు. "ఖత్‌రో కా ఖిలాడీ" అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు.
और क़ानून को ऐसे लोगों को गिरफ़्तार भी करना चाहिए।
— Radhika Khera (@Radhika_Khera) July 19, 2022
हादसा तो टल गया लेकिन और कितने लोग इससे ग़लत सीख लेंगे!
yeah...thats how north indians use public transport where ever they want to get down...even if they are run over by train, they would sue train but never follow rules. As if their fortunes get upside down if they wait just 2 minutes until train leaves or get down at station
— South indian observer (@south_observer) July 19, 2022