అన్వేషించండి

Viral News: రెంట్ పెంచలేదు, మా ఇంటి ఓన‌ర్ చాలా మంచోడు - ఇలాంటి వ్యక్తులు కూడా ఉంటారా!

ఐదేళ్లుగా తాను అద్దెకుంటున్న ఇంటి నుంచి ఖాళీ చేస్తున్న వ్య‌క్తి, ఇంటి య‌జ‌మానితో త‌న‌కున్న అనుబంధం గురించి అద్భుతంగా రాసుకొచ్చాడు. Reddit లో రాసిన ఈ పోస్ట్ సోష‌ల్ మీడియా ద్వారా వైర‌ల్‌గా మారింది. 

Tenant Experience about house owner | బెంగ‌ళూరులో ఐదేళ్లుగా అద్దెకుంటున్న ఇంటి నుంచి ఒక వ్యక్తి ఖాళీ చేస్తూ ఇంటి య‌జ‌మాని వ్యక్తిత్వం గురించి గొప్పగా చెప్పుకొచ్చాడు. తాను 2018 నుంచి గ‌డిచిన ఐదేళ్లుగా అదే ఇంట్లో అద్దెకుంటున్నాన‌ని ఆ వ్యక్తి తెలిపాడు. తాను ఇంటిని ఖాళీ చేసి వెళ్లి పోతున్న సంద‌ర్భంగా త‌న ఇంటి య‌జ‌మాని త‌న‌కోసం ఏర్పాటు చేసిన స‌ర్‌ప్రైజ్ చూసి న‌వ్వాగ‌లేద‌ని రాశాడు. అలా రాస్తూనే త‌న ఇంటి య‌జ‌మాని మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిగా అభివ‌ర్ణించాడు. త‌న‌తో ఎప్పుడూ కోపంగా మాట్లాడ‌టం లేదా ఇబ్బంది క‌లిగించ‌డం చేయ‌లేద‌ని ఆయ‌నొక ఉన్న భావాలు క‌లిగిన పెద్ద మ‌నిషి అని చెప్పాడు. 2018లో ఆ ఇంట్లో అద్దెకు చేరిన నాటి నుంచి ఈ రోజు వ‌ర‌కు త‌న‌కు ఒక్క రూపాయి కూడా అద్దె పెంచ‌లేద‌ని రాశాడు. బెంగళూరులో ఇలాంటి వ్య‌క్తులు ఉంటారని మీరు ఊహించ‌గ‌ల‌రా అని సంతోషం వ్య‌క్తం చేశాడు. అలాంటి య‌జ‌మాని ఇంట్లో తాను అద్దెకుండ‌టం అదృస్టంగా భావిస్తున్నాన‌ని చెప్పాడు. 

ఉన్నతమైన వ్యక్తిత్వం క‌లిగిన పెద్ద మ‌నిషి
గ‌డిచిన ఐదేళ్లలో త‌న య‌జ‌మానితో ఏ చిన్న మాట ప‌ట్టింపు వ‌చ్చిన దాఖ‌లాలు కూడా లేవ‌ని ఆ వ్యక్తి వివ‌రించాడు. ఒక్క రూపాయి కూడా రెంట్ పెంచ‌క‌పోగా, త‌న‌కు చాలా సార్లు డ్రింక్ ఆఫ‌ర్ చేశాడ‌ని చెప్ప‌డం విశేషం. కానీ, తాను యజ‌మానితో క‌లిసి ఏరోజూ డ్రింక్ చేయ‌లేద‌న్నాడు. ఇత‌రుల గురించి కూడా త‌న ఇంటి య‌జ‌మాని ఎప్పుడూ నెగిటివ్‌గా మాట్లాడ‌టం చేయ‌లేద‌ని త‌న పోస్టులో వివరించాడు. ఎప్పుడూ త‌న వ్యక్తిగ‌త జీవితం, త‌న జీవిత అనుభ‌వాలు పాఠాల‌ను చెప్పేవాడ‌న్నారు. త‌న కుమార్తె గురించి మాత్రం చాలా గొప్ప‌గా చెప్పుకుని మురిసిపోవ‌డం చూశాన‌ని రెంట్ కు ఉంటున్న వ్య‌క్తి చెప్పాడు. ఆ వ్యక్తి రాసిన పోస్టుకు నెటిజ‌న్లను విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. వారు కూడా త‌మ అనుభ‌వాల‌ను వివ‌రిస్తున్నారు. తాము అద్దెకుంటున్న ఇంట్లో ఎదురైన ప‌రిస్థితుల‌ను కామెంట్ల రూపంలో వ్యక్తప‌రుస్తున్నారు. 

మా య‌జ‌మాని కాలిపోయిన వ‌స్తువులు కొనిచ్చింది
మా ఇంటి య‌జ‌మాని విద్యుత్ షార్ట్ స‌ర్క్యూట్ కార‌ణంగా కాలిపోయిన మ్యాక్ బుక్ ఛార్జర్ కేబుల్‌, అడాప్ట‌ర్‌కు డ‌బ్బులు చెల్లించింద‌ని కామెంట్ చేశాడు. మ‌రో వ్యక్తి తాను ఎనిమిదేళ్లగా ఓకే ఇంట్లో ఉన్నాన‌ని త‌న ఇంటి య‌జ‌మాని త‌న కోసం ఇంటిని ఖాళీ చేసే స‌మ‌యంలో వ‌స్తువులు స‌ర్ద‌డానికి సాయం చేశాడ‌ని చెప్పాడు. ద‌గ్గ‌రుండి షిప్టింగ్ ప‌నులు చూసుకున్నందుకు కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశాడు. మ‌రో వ్య‌క్తి తాను ఇంటిని ఖాళీ చేసే స‌మయంలో వంట మ‌నిషి త‌మ కోసం భారీగా బిర్యానీ వండి తీసుకొచ్చి సంతోష‌పెట్టార‌ని ఆనందం పంచుకున్నాడు. ఇంకో వ్య‌క్తి త‌మ ఇంటి ఓన‌ర్ నేను క‌ష్టాల్లో ఉన్నాన‌ని గ్ర‌హించి ఎనిమిదేళ్ల‌లో రెండు సార్లు ఇంటి రెంట్ పెంచ‌లేద‌ని గుర్తు చేసుకున్నాడు. మ‌రో వ్య‌క్తి త‌న అనుభ‌వాన్ని వివ‌రిస్తూ త‌న ఇంటి ఓన‌ర్ సెక్యూరిటీ డిపాజిట్ కింద ఇచ్చిన మొత్తాన్ని తిరిగిచ్చేయ‌డం ఊహించ‌లేద‌ని, ఖ‌ర్చుల కోసం న‌న్నే వాడుకోమ‌ని చెప్ప‌డం చూసి సంతోష‌మేసింద‌న్నాడు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Andhra Flood Relief: ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
Harish Rao: 'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
Kashmir Elections : కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

హైదరాబాద్ దాటిన హైడ్రా బుల్‌డోజర్లు, ఇకపై రాష్ట్రవ్యాప్తంగా కూల్చివేతలులెబనాన్‌లో పేజర్ పేలుళ్ల కలవరం, ఇజ్రాయేల్‌పై ఆరోపణలుభారత్, బంగ్లాదేశ్‌ల మధ్య తొలి టెస్టు నేడే‘కూలీ’లో నాగార్జున సైమన్ లుక్ లీక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Andhra Flood Relief: ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
Harish Rao: 'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
Kashmir Elections : కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
Naga Babu-Jani Master: నాగబాబు వరుస ట్వీట్స్‌ - జానీ మాస్టర్‌ను ఉద్దేశించేనా?
నాగబాబు వరుస ట్వీట్స్‌ - జానీ మాస్టర్‌ను ఉద్దేశించేనా?
Kadambari Jethwani 'కేసు విత్ డ్రా చేసి న్యాయం చేయండి' - హోంమంత్రి అనితను కలిసి ముంబయి నటి కాదంబరి జత్వానీ
'కేసు విత్ డ్రా చేసి న్యాయం చేయండి' - హోంమంత్రి అనితను కలిసి ముంబయి నటి కాదంబరి జత్వానీ
Balineni Srinivasa Reddy: జగన్‌ తీరు నచ్చలేదు- పార్టీ నుంచి బయటకు పంపే కుట్రలు చేశారు: బాలినేని కీలక వ్యాఖ్యలు
జగన్‌ తీరు నచ్చలేదు- పార్టీ నుంచి బయటకు పంపే కుట్రలు చేశారు: బాలినేని కీలక వ్యాఖ్యలు
Telangana: తెలంగాణవాసులకు బిగ్ అలర్ట్‌- మీ వాహనం కొని 15 ఏళ్లు దాటిందంటే తుక్కే
తెలంగాణవాసులకు బిగ్ అలర్ట్‌- మీ వాహనం కొని 15 ఏళ్లు దాటిందంటే తుక్కే
Embed widget